మోదీ ఈసారి దక్షిణాది నుంచి పోటీ చేస్తారా?

నరేంద్ర మోదీ 2014 లో ఉత్తరప్రదేశ్ లో వారణాసి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఏనాడు గెలవని ప్రాంతంలో మోదీ విజయం సాధించి సంచలనం సృష్టించాడు. 2019 లో కూడా గెలిచి తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు. ఆనాడు ఉత్తరప్రదేశ్ లో మోదీ గెలవడంతో పాటు దాదాపు 65 కు పైగా ఎంపీ స్థానాలు గెలిచి బీజేపీ గెలుపుకు బాటలు వేశాడు.

వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కొన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చినా 2003 ఎలక్షన్లలో బీజేపీ ఓడిపోవడంతో దాదాపు 10 సంవత్సరాల పాటు అధికార పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆద్వానినీ ప్రధాని క్యాండిడేట్ గా గుర్తించి ఎన్నికలకు వెళ్లినా 2009 సంవత్సరంలో పార్టీ పూర్తిగా విజయం సాధించలేక చతికిల పడింది. దీన్ని గుర్తించిన ఆర్ఎస్ఎస్, బీజేపీ కొత్త నాయకత్వంలో 2014 ఎలక్షన్లకు వెళ్లారు.

నరేంద్ర మోదీ వారణాసి నుంచి పోటీ చేయడం బీజేపీకి అదనపు బలం చేకూరింది. అసలేమాత్రం చాన్స్ లేని స్థానంలో నుంచి తాను గెలవడమే కాకుండా తన పార్టీని గెలిపించుకున్నారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఇలా పక్కా ప్రణాళికతో రెండు సార్లు ఎన్డీఏ విజయం సాధించడంతో మోదీ చరిస్మా పెరిగిపోయింది. ప్రస్తుతం దక్షిణాదిలో బీజేపీ వీక్ గా ఉంది. ఇక్కడి నుంచి మోదీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నారు.

మోదీ దక్షిణాది నుంచి పోటీ చేయడం వల్ల ఇక్కడ బీజేపీకి ఊపు తీసుకురావచ్చన్న ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ దక్షిణాది నుంచి పోటీ చేస్తే అసలే మాత్రం ఓటింగ్ శాతం లేని తమిళనాడు నుంచి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఒక ప్రాంతంలో మోదీ పోటీ చేయాలని అక్కడి ప్రజలు బలంగా కోరుతున్నట్లు తెలుస్తోంది. మరి మోదీ దక్షిణాదిన పోటీ చేస్తే బీజేపీ ఎంపీ స్థానాలు పెరుగుతాయా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: