ఏపీ: జగన్‌కు షర్మిల బిగ్‌ షాక్‌ ఇస్తుందా?

షర్మిళ తెలంగాణలో వైఎస్సాఆర్ టీపీ పేరుతో పార్టీ పెట్టుకుని రాజకీయాల్లో దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే ఈ మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఆ పార్టీకి ఒక్కసారిగా ఊపు వచ్చింది. దీంతో షర్మిళ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె శివకుమార్ తో రెండు సార్లు సమావేశ మయ్యారు. ఈ సమావేశం వెనక ఏదో నడుస్తోందని తీవ్రమైన చర్చే మొదలైంది.

షర్మిళ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమైనట్లు తెలంగాణ కాంగ్రెస్ లో కీలకంగా మారేందుకు పావులు కదుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా గెలవడమే కాకుండా దేశంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధినాాయకత్వానికి అంతకుముందుకు వైఎస్ అంటే ఎంతో నమ్మకం. కానీ ఒక్కసారిగా వైఎస్ చనిపోయిన తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

జగన్ పై అక్రమార్కుల ఆస్తుల కేసులు పెట్టడం, ఆయన్నుకాంగ్రెస్ జైలుకు కూడా పంపింది. కేవలం సోనియా గాంధీ చెప్పిన మాట వినకపోవడం వల్లేనని జగన్ పైనే కాకుండా ఎఫ్ఐఆర్ లలో వైఎస్ పేరు కూడా చేర్చారు. దీంతో జగన్ కాంగ్రెస్ కు దూరమై సొంత పార్టీ పెట్టుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా గెలుపొంది పాలన కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ మళ్లీ షర్మిళ రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సోనియా, రాహుల్ గాంధీలు ఇడుపులపాయకు రానున్నారని వైఎస్ సమాధి వద్ద నివాళి అర్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో షర్మిళ రూపంలో జగన్ కు కూడా చెక్ పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్ కు ప్రస్తుతం బీజేపీ నుంచి కూడా సపోర్టు అందడం లేదు. కాబట్టి జగన్ పై షర్మిళ బాణం విసిరితే చెప్పినట్లు వినే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ విషయంలో షర్మిళనే సరైన నాయకురాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: