బాబు హామీల వ్యూహం: జగన్‌ను ఇరుకున పెడుతోందా?

సీఎం జగన్ నవరత్నాలు అందిస్తామనే ప్రచారంతో ప్రజల ముందుకు పాదయాత్రగా వెళ్లారు. ప్రజలు నవరత్నాల హామీని నమ్మి గెలిపించారు. అయితే నవరత్నాల హామీలో 7 పథకాలు సంపూర్ణంగా అమలయ్యాయి. కానీ రెండు మాత్రం కాలేకపోతున్నాయి. ఒకటి సంపూర్ణ మద్య నిషేధం, రెండోది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్. మొదట్లో జాబ్ క్యాలెండర్ కింద వాలంటీర్ల జాబ్స్ ఇచ్చినా దాన్ని ప్రతి ఏడాది అమలు చేయలేకపోతున్నారు.

మద్య నిషేధం పక్కకు వెళ్లిపోయింది. బెల్ట్ షాపులు, ఊర్లలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు లేకపోయినా సంపూర్ణ మద్య నిషేధం అనేది కాకపోవడంలో మద్య నిషేధ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నా లక్ష్మారెడ్డి దీనిపై తీవ్ర నిరాశలో ఉన్నాడు. వీటిన్నింటిని పక్కన పెడితే ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు నాయుడు కొన్ని హామీలను ఇస్తున్నారు. సీఎం జగన్ ప్రస్తుతం రైతుకు రూ.13,500 ఇస్తున్నారు. కానీ చంద్రబాబు దాన్ని రూ. 20 వేలకు పెంచుతామని చెబుతున్నారు.

అమ్మఒడి పథకం ఇంటికి ఒకరికి జగన్ ఇస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంట్లో నలుగురు ఉన్నా ఇస్తామని చంద్రబాబు హామీల వర్షం కురిపిస్తున్నారు. చేయూత స్కీంల కింద 45 ఏళ్ల దాటినా వారికి సీఎం జగన్ పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఏకంగా 18 సంవత్సరాల నుంచే దీన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. ఇది అత్యంత కీలకమైన విషయం.

పవన్ కూడా వారాహి యాత్ర కొనసాగుతుంది. పవన్ షణ్ముక వ్యుహాం తో ముందుకు వెళతామని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే  ప్రతి నియోజకవర్గంలో 500 మందికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు.  ఇదే విధంగా చంద్రబాబు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు. అలాగే ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తామని ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చేస్తున్నారు. మరి వీరి హామీలను ప్రజలు నమ్ముతారా.. జగన్ ను ఓడించడానికి ఇస్తున్న హామీలు గెలిచిన తర్వాత ఇవ్వడం సాధ్యమేనా అనే చర్చ ప్రజల్లో వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: