కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే యోగాను నిషేధిస్తుందా?

మతమార్పిడులను అనుసరించేవారు, ఎంకరేజ్ చేసేవారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారని తెలుస్తుంది. ఎందుకంటే మత మార్పిడి అనేది అది వాళ్ళ వ్యక్తిగత హక్కు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని తెలుస్తుంది. మత మార్పిడుల నిరోధక చట్టాన్ని తీసుకు వస్తే, మత మార్పిడులను చేసుకోవచ్చు అనే అవకాశం కల్పిస్తానంటుంది కాంగ్రెస్.

కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లో దేశభక్తి పాఠ్యాంశాన్ని తొలగించి, దాని ప్లేస్ లో టిప్పు సుల్తాన్  పాఠ్యాంశాన్ని చేర్చపోతుందట. ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత మార్పిడులను విస్తృతంగా అమలుపరిచే, పరుచుకోగలిగే అవకాశాన్ని ఇస్తుంది. అది మతపరమైన హక్కు అని కూడా అంటుంది. అంతే కాకుండా  మైనార్టీలకి సంపూర్ణ హక్కులనూ ఇస్తుంది. మెజార్టీ వర్గం వాళ్లు మైనార్టీ వాళ్ళ చెప్పు చేతల్లో నడవాలి అన్నట్లు కూడా అది చేసుకు వస్తుంది.

ఇంకా చెప్పాలంటే అది మరొక చట్టాన్ని తీసుకువచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు కొంతమంది. ఆ చట్టం ఏంటంటే హిందువులు ఒక పూజ చేసుకోవాలనుకున్నా, ఒక రామ భజన చేసుకోవాలనుకున్నా దగ్గర్లో ఉన్న మైనారిటీలకు సంబంధించిన ప్రార్థన మందిరం నుండి ఎన్ఓసి తీసుకువచ్చే చట్టాన్ని తీసుకొచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు వాళ్లు. ఎందుకంటే మైనార్టీ వాళ్ళు సమిష్టిగా ఉంటారు. వాళ్ల ఓట్లు కూడా సమిష్టిగానే పడతాయని వాళ్ళ ఉద్దేశం.

వాళ్లు ఒక 30% ఉన్నా, మిగిలిన 70% వేరే వర్గాల వాళ్ళు కులాల వారీ విభజనల పరంగా ఓట్లు వేస్తారని వాళ్ళ లెక్క. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే యోగాని హిందుత్వ సిద్ధాంతం అనుకుని యోగాను కూడా బ్యాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేస్తామని ఆల్రెడీ కాంగ్రెస్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు యోగా కూడా ఆర్ఎస్ఎస్ విధానం అనుకొని యోగాని బ్యాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోడీ మొదలుపెట్టిన యోగా బ్రేక్ ని కూడా రేపు కాంగ్రెస్ నిషేధిస్తుందేమో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: