మోదీ నిధులు ఎక్కువగా ఏపీకే దక్కుతున్నాయా?
ఉద్యోగస్తులు లంచాల రూపంలో కొంత ఆర్జించేవారు. అలాగే రాజకీయ నాయకులు రికమండేషన్లు రూపంలో కొంత సంపాదించుకునే వారని అంటున్నారు. అలాగే వాణిజ్య శాఖ చూసే మంత్రులకు కూడా కమర్షియల్ ట్యాక్స్ రూపం లో డబ్బులు అనేవి వస్తూ ఉండేవని తెలుస్తుంది. అయితే జిఎస్టి వచ్చాక ఇవన్నీ మారాయి. ఈ డబ్బు అంతా మిగలడంతో మిగిలిన ఈ డబ్బు అంతా రాష్ట్రానికి అధిక ఆదాయం రూపంలో జీఎస్టీ వల్ల కలిసొస్తుందని తెలుస్తుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, మిగిలిన అన్ని రాష్ట్రాలకు కూడా పన్నుల పంపిణీ రూపంలో మూడో విడత నిధులు రిలీజ్ చేసిందని తెలుస్తుంది. ఈ నెలకు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక 1,18,250కోట్లు రూపాయల నిధులు రిలీజ్ చేసినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అందులో ఆంధ్రకు 4,767 కోట్లు, తెలంగాణకు 2,486కోట్లు రిలీజ్ చేసిందని తెలుస్తుంది.
అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ కు 21,218కోట్లు విడుదల అవ్వగా, దాని తర్వాత బీహార్ కు 11,879కోట్లు పన్నులకు సంబంధించిన నిధులను రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రాల మూల ధన వ్యయం కోసం, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం కోసం ఆయా ప్రాధాన్యత గల ప్రాజెక్టులకు, పథకాలకు ఉపయోగపడతాయని కేంద్రం ఈ నిధులను పంపిణీ చేసే సమయంలో అభిప్రాయపడిందని తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్పే దాని ప్రకారం చూసుకుంటే మరి ఆంధ్రకే ఎక్కువ నిధులు వచ్చాయి కదా అని కొంతమంది అంటున్నారు.