అమిత్‌షా, జగన్‌ వైరం.. ఆ మీడియాకు పండుగేనా?

భారతీయ జనతా పార్టీ నాయకులు జయ ప్రకాశ్ నడ్డా టీడీపీతో పొత్తుకు కాస్త అనుకూలంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రమేశ్, సుజన చౌదరి, ఆది నారాయణ రెడ్డి లాంటి మాటలు నడ్డా వింటున్నట్లు తెలుస్తోంది. నడ్డా కు ఆంధ్రలోని బీజేపీ నాయకులతో అంతగా సత్సంబంధాలు లేనట్లే తెలుస్తోంది. ఇటీవల జేపీ నడ్డా, అమిత్ షా స్పీచ్ ల్లో తేడా కనిపిస్తోంది. అమిత్ షా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు. కాబట్టి సోము వీర్రాజు ను ఒక సారి టచ్ చేసి మాట్లాడతారు.

ఇటీవల అమిత్ షా తన ఉపన్యాసంలో రాష్ట్రంలో తొమ్మిదేళ్ల పాలన గురించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిది సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల సాయం చేశాం. కానీ వాటితో రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటుంది. కానీ అభివృద్ధి మాత్రం చూపించడం లేదన్నారు. జేపీ నడ్డా కూడా అమరావతి విషయంలో జగన్ ఫెయిల్ అయ్యాడని అన్నారు. కాబట్టి ఆంధ్రలో మాకు ఒకసారి అవకాశం ఇవ్వండని బీజేపీ నాయకులు కేంద్ర హొం మంత్రి ప్రజలను కోరారు.

జగన్ ను గద్దె దించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అని కోరారు. జగన్ ను గద్దె దించాలని ఆంధ్రలో మీడియా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం నుంచి డబ్బులు రావాలి. నిధులు వచ్చి వాటిని మా నాయకుడే తీసుకొచ్చాడని ప్రచారం చేయాలని టీడీపీ, బీజేపీ, రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల కంటే దాని అనుకూల మీడియానే ఎక్కువ ప్రచారం చేస్తుంది. తమ తమ పార్టీలకు ఎక్కువగా ప్రచారం చేయడం అలవాటైనా మీడియాకు అమిత్ షా మాట్లాడిన స్పీచ్ ఎక్కువగా ఎనర్జీ ఇచ్చినట్లయింది.

అమిత్ షా జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం వల్ల రాబోయే రోజుల్లో బీజేపీ, వైసీపీ పార్టీ ల పరిస్థితి ఎలా ఉండబోతుందనేది తేలాల్సిన అంశం. బీజేపీ ఆంధ్రలో టీడీపీతో కలిస్తే కాస్త ప్రయోజనం ఉంటుందని కొంతమంది రాజకీయ నిష్ణాతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: