బీజేపీ స్టాండ్ మారింది.. ఇక జగన్ జైలుకేనా?
దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సమాధాన మిచ్చారు. వైసీపీకి, బీజేపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధమే తప్పా మరే ఇతర సంబంధం కాదని పేర్కొంది. ముఖ్యంగా ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలవడం వెనక రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరే ఇతర అంశం ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కావాల్సిన అవసరాల గురించి మాత్రమే సీఎం గానీ ఇతర ఎంపీలు కానీ బీజేపీ నాయకులను కలుస్తామని చెప్పారు.
దాన్ని కొన్ని తెలుగు మీడియా చానళ్లు, టీడీపీ లాంటి పార్టీలు ఏదో బీజేపీతో కలిసిపోయినట్లు విష ప్రచారం చేస్తాయని అన్నారు. అయితే బీజేపీతో కలిసి పనిచేసిన పార్టీ టీడీపీ, జనసేనలు మా సిద్ధాంతం ప్రకారం.. బీజేపీతో కలిసి ఇప్పటి వరకు పోటీ చేయలేం. అయినా మా పై కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయి.
దీన్ని మానుకుంటే మంచిదని హితవు పలికారు.. 20 నుంచి 25 ఏళ్ల నుంచి టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసిన సందర్భం ఉంది. కానీ వైసీపీ మాత్రం ఇంతవరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు లేదని కేవలం రాజకీయ లాభం కోసం మాత్రమే జగన్ ను ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేసేందుకు టీడీపీ ఆడిస్తున్న కుట్రగా భావిస్తున్నట్లు విజయసాయి రెడ్డి అన్నారు.