టీడీపీ, జనసేన పొత్తు..లగడపాటి అంచనా ఇది?

లగడపాటి రాజగోపాల్ ఈయనకు ఆంధ్ర ఆక్టోపస్ అనే పేరు ఉన్న విషయం చాలామందికి తెలిసిన విషయమే. గతంలో 2014 ఎలక్షన్లకు ముందు ఆంధ్రలో తెలుగుదేశం గెలుస్తుందని, తెలంగాణలో టిఆర్ఎస్ గెలుస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన చెప్పినట్లుగానే జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆయన మాటలు నమ్మే చాలా మంది సైలెంట్ గా ఉన్నారు అనడం కన్నా, స్పీడ్ తగ్గించారు అనడం కరెక్ట్.



కానీ రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన రాజకీయ సన్యాసం కూడా తీసుకోవడం జరిగిపోయింది. ఇదివరకు ఆయన ఒక సర్వే చెప్తే ఆయన చెప్పినట్టుగానే జరిగేది. కానీ ఆ తర్వాత ఆయన చెప్పిన సర్వేలన్నీ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. 2018కి వచ్చేసరికి తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ కి బదులుగా ఆంధ్ర సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యేలా ఉందని ఆయన చెప్పారు.



అంతేకాకుండా అక్కడ తెలుగుదేశం ఇంకా కాంగ్రెస్ పార్టీ పొత్తు వల్ల టిఆర్ఎస్ ఓడిపోతుందని కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్లలో కూడా తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. అయితే ఈ రెండు సందర్భాలలో కూడా ఆయన చెప్పింది జరగలేదని తెలుస్తుంది. దాంతో ఆయన పేరు కొంచెం వీక్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ లగడపాటి రాజగోపాల్ తన సర్వేలకు పదును పెట్టారని తెలుస్తుంది.



తాజాగా ఆయన తెలుగుదేశం ఇంకా జనసేన పొత్తు పైన తన సర్వే వివరాలు తెలిపినట్లుగా తెలుస్తుంది. ఓట్ల సమయంలో చాలా వరకు చిన్న పార్టీలు పెద్ద పార్టీలకు తమ ఓట్లను బదిలీ చేస్తాయి. కానీ పెద్ద పార్టీలు చిన్న పార్టీలకు తమ ఓట్లను బదిలీ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా తన ఓట్లను మిగిలిన పార్టీలకు షేర్ చేయలేదని తెలుస్తోందని లగడపాటి చెబుతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: