షాకింగ్‌ రిపోర్ట్‌: దేశం దాటుతున్న అమ్మాయిలు?

గతంలో అమ్మాయిలని గడప దాటనిచ్చేవారు కాదు. బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే తోడుగా అన్నయ్యనో, తమ్ముడినో ఇచ్చి పంపేవారు. తోడు ఎవరూ లేకపోతే గడప దాటడం బంద్. ప్రస్తుతం ఇండియాలో అమ్మాయిలు ప్రపంచ దేశాల మహిళలతో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా విదేశాలకు పల్లెటూళ్ల నుంచి పై చదువులకు వెళుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఉద్యోగాలు చేయడానికి పెద్ద పెద్ద నగరాలకు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్లలో 150 శాతం వరకు విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం..  దేశంలోని మెట్రో నగరాల్లో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది.

2019 కు ముందు మెట్రో నగరాల నుంచి విదేశాలకు వెళ్లే పురుషులు, మహిళల సంఖ్య 70-30 నిష్పత్తిగా ఉండేది. పురుషులు 70 శాతంగా ఉంటే మహిళలు 30 శాతం మందే వెళ్లేవారు. 2022 సంవత్సరానికి వచ్చే సరికి మెట్రో నగరాల్లో విదేశీ విద్య అభ్యసించడానికి వెళ్లే వారి సంఖ్య 50-50 శాతంగా మారింది. పురుషులు 50 శాతం మంది వెళితే, మహిళలు కూడా 50 శాతం వరకు వెళుతున్నారు.

2019 లో చిన్న నగరాల నుంచి విదేశాలకు విద్య కోసం వెళ్లిన వారిలో పురుషులు 80 శాతం ఉంటే మహిళలు 20 శాతం మాత్రమే ఉండేవారు. 2022 వచ్చే సరికి 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు విదేశాల బాట పడుతున్నారు. మరో విషయం చిన్న పట్టణాల నుంచి విదేశాలకు వెళ్లే పురుషుల శాతం 80 శాతంగా ఉంటే మహిళలు కేవలం 20 శాతం వెళ్లేవారు. 2022 నాటికి 55 శాతం పురుషులు వెళితే మహిళలు 45 శాతం వెళ్లడం విశేషంగా మారింది. అమ్మాయిలను గతంలో గడప దాటనిచ్చేందుకే భయపడే వారు సైతం.. ప్రస్తుతం విదేశాలకు వెళ్లి మరీ చదువుకునేలా అమ్మాయిలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు నిజంగా సలాం చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: