కృష్ణుడి వేషం.. ఎన్టీఆర్‌ పరువు తీస్తున్నారా?

తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. అలాగే  ఈనెల 28న  ఖమ్మంలో శ్రీకృష్ణుడి విగ్రహ ఆవిష్కరణ అంటే, రామారావు రూపంలో ఉండే శ్రీకృష్ణుని విగ్రహావిష్కరణ జరగబోతుంది. అయితే ఈ రామారావు రూపంలో ఉండే శ్రీకృష్ణుని విగ్రహం అనే విషయంపై కొన్ని సంఘాలు కోర్టులో కేసు వేశాయని తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇలా చేయడం ఏమీ తప్పు కాదని, ఆల్రెడీ రాజమండ్రిలోనూ మరికొన్నిచోట్ల రామారావు రూపంలోనే విగ్రహాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు.

అప్పుడు ఎప్పుడు చేయని ఇష్యూ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారన్నట్లుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రస్తుతం ఈ విగ్రహ ఆవిష్కరణ పై అయితే కోర్టు స్టే విధించింది. అయితే ఇప్పుడు నిర్వాహకులు మధ్యే మార్గంగా ఒక పద్ధతి ఆలోచించారని తెలుస్తుంది. దాని ప్రకారం, వారి ఆలోచన ప్రకారం విగ్రహం యొక్క కిరీటం ఇంకా పిల్లన గ్రోవి తీసివేసి విగ్రహావిష్కరణ చేయించేస్తాం అన్నట్లుగా చెప్తున్నారట.  

కానీ ఇలా చేయడానికి కూడా కోర్టు అనుమతి కావాలి. అయితే కోర్టు అనుమతి లేకుండానే ఈనెల 28న వీళ్ళు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో అని కొంతమంది అనుకుంటున్నారు.  తర్వాత ఎటువంటి ఇష్యూస్ వస్తాయో అనుకుంటున్నారు వాళ్ళు. 1957లో మాయాబజార్ లో మొదటిసారి సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుని పాత్రను పోషించారు. ఆ తర్వాత 1966 లో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు అయింది.

అంటే ఇస్కాన్ మొదలు పెట్టక ముందే శ్రీకృష్ణుని రూపానికి గుర్తింపు తెచ్చింది మొదటిగా ఎన్టీఆర్ అని కొంతమంది మాట్లాడుతున్నారట. అంటే కృష్ణుడి రూపంపై వీళ్లకు రైట్స్ ఉన్నాయా వీళ్ళు పెట్టే విగ్రహం లోని రూపం కృష్ణుడిదే అని గ్యారెంటీ ఏంటి అంటూ కొంతమంది వాదిస్తున్నట్లుగా తెలుస్తుంది. చివరికి వీళ్ళు వీళ్ళు గొడవపడి దేవుడి ఉనికినే ప్రశ్నిస్తున్నట్లుగా తయారయింది వ్యవహారం. రామారావు గారు అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే కానీ ఈ గొడవలతో ఆయన పరువును కూడా ఇలా కొంతమంది తీసేస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: