జగన్‌ అమరావతికి మేలు చేస్తున్నారా? కీడు చేస్తున్నారా?

అమరావతిలో  50 వేల ఇళ్లకు స్ధలం సరిపోని పరిస్థితుల్లో ఇటీవల మరో 268 ఎకరాలు కేటాయించినట్లుగా తెలుస్తుంది. అమరావతి విషయంలో  పేదవాళ్ళని దెబ్బ కొడుతున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు.  రైతులు భూమిని ఇచ్చినందుకైనా వాళ్ళకి ఏదైనా ప్రయోజనం చేకూరాలి కదా అని కొంతమంది అంటున్నారట. కాని మరో పక్కన, అసలు భూములు ఇచ్చిన రైతులకు ఏ ప్రయోజనం చేకూరలేదని ఎలా అంటారు అని కొంతమంది అంటున్నారు.

వాళ్లు చెప్తుంది ఏంటంటే రైతులకు ఏమి చేయకపోతే కనుక వాళ్ల భూమి ఇప్పుడు కూడా 40 లక్షలు  పలుకుతుంది కదా. కానీ ఇప్పుడు అక్కడ భూమి ధర నాలుగు కోట్లని తెలుస్తుంది. పది లక్షల భూమి 40 లక్షల ధర పలుకుతుంది ఇప్పటికి కూడా అక్కడ. అమరావతి రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు. ఒక బిల్డర్ కి స్ధలం యజమానికి మధ్యన సంబంధం కాదు. రాజధాని అంటే అందరిదీ. కానీ అందరికీ సంబంధించిన రాజధానిని కొందరికే పరిమితం చేస్తామన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు అని తెలుస్తుంది.  

విట్ కి ఇచ్చినప్పుడు లేని ఇబ్బంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఇచ్చినప్పుడు లేని ఇబ్బంది, వీళ్ళకి ఇవ్వడానికి ఎందుకు వస్తుందని కొంతమంది అడుగుతున్నారు. వాళ్లకైతే స్థలం తక్కువగా వచ్చింది 25 లక్షలకి. కానీ రాష్ట్రానికి వాటి వల్ల వచ్చిన ఉపయోగం ఏముంది. ఆల్రెడీ ఇక్కడ గీతం యూనివర్సిటీ లేదా? విజ్ఞాన్ యూనివర్సిటీ లేదా? అని కొంతమంది అడుగుతున్నారు. దానికి కొంతమంది చెప్పే సమాధానం ఏంటంటే అదే అభివృద్ధి అని అంటున్నారట.

రాజధాని అవ్వాలంటే అక్కడ అన్ని రకాల ప్రజలు ఉండాలి. కానీ కేవలం 29 గ్రామాల ప్రజలు మాత్రమే ఉంటే అది రాజధాని ఎందుకు అవుతుంది అని కొంతమంది అడుగుతున్నారు. అలా కాకుండా కేవలం పారిశ్రామికవేత్తలే ఉంటే, అది అందరి రాజధాని ఎలా అవుతుందని వాళ్ళు అడుగుతున్నారు.  ఒక ప్రాంతం, రాజధానిగా పిలవబడాలి అంటే అక్కడ ప్రజలు ఉండాలి అదే రూల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: