ఆఫ్ఘనిస్తాన్‌ సాయం కోరుతున్న చైనా?

చైనా నుంచి ఇరాన్, రష్యాకు రహదారి మార్గం నిర్మించి దాని ద్వారా వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగించాలని డ్రాగన్ కంట్రీ ఆలోచన. దీనికి పాకిస్థాన్ నుంచి ఈ రహదారి వేయాలనుకుని నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ లోని కైబర్ పంక్తువా లో ఈ రోడ్డు నిర్మాణానికి అడ్డు తగులుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, అప్గాన్, ఇరాన్, రష్యాకు దారి వేయాలని ప్లాన్ వేసింది.


సింధు రెబల్స్, ఐఎస్ ఐఎస్ వారు ఎదురు దాడికిి దిగుతున్నారు. అయితే పాకిస్థాన్ సాయం కోరాలని చైనా ప్రయత్నించింది. పాక్ లో రోడ్డు వేయడం ద్వారా మీకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది అని చెప్పింది. దీనికి పాక్ ప్రభుత్వం ఓకే అంటున్న కైబర్ పంక్తువా లోని ఉగ్రవాదులు, ఐఎస్ తీవ్రవాదులు అడ్డు తగులుతున్నారు. టవర్లు పేల్చేస్తున్నారు.


పోనీ పాక్ సైన్యం, పోలీసుల సాయం తీసుకుందామంటే వారిపైనే ఈ తీవ్ర వాదులు దాడులు చేస్తున్నారు. ఇలా దాడులు చేయడం వల్ల తీవ్ర నష్టమే కలుగుతోంది. దీంతో చైనా అప్గాన్ కు ఆఫరిచ్చింది. అఫ్గాన్ దేశం నుంచి రోడ్డు వేయాలనుకుంటున్నాం అని తాలిబాన్ల ప్రభుత్వాన్ని సాయం కోరింది. తద్వారా మీరు టోల్ టాక్స్ వసూలు చేసుకోవచ్చు.


ఆర్థికంగా బలంగా తయారు కావచ్చు. అని అఫ్గాన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇదే సమయంలో పాక్ సరిహద్దుల్లో తెహ్రీక్ ఇ తాలిబాన్ల ను కంట్రోల్ లో పెట్టాలని చైనా తాలిబాన్లను కోరింది. తద్వరా మీ దేశం ఆర్థికంగా బలపడవచ్చని చెప్పింది. మీకు ఎలాంటి సహాయ సహకారాలైన అందిస్తామని హామీ ఇచ్చింది. గతంలో అమెరికా అప్గాన్ లో ఉన్నపుడు ఎప్పుడూ వెళ్లిపోతుందా అని అనుకున్న వారు.. ఇప్పుడు అమెరికా ఉంటేనే బెటర్ అనే స్థాయికి వచ్చారు. ప్రస్తుతం చైనా సాయం అందించేందుకు రోడ్డు, రవాణా మార్గాలను మెరుగుపరిచి ఆధాయ మార్గాలను చూపిస్తానంటోంది. మరి తాలిబాన్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: