భారత్‌కు పెనుముప్పు.. ఆ విచ్ఛిన్నం సరికాదు?
45 ఏళ్ల నుంచి కన్న కొడుకే సర్వస్వంలా పెంచి పెద్ద చేశాడు. వ్యాపారాల్లో లాభం సంపాదించి కొడుకును కోటిశ్వరుడు చేశాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు. అయితే ఒక రోజు భోజనంలో మామా చివర్లో పెరుగు అడుగుతాడు. కోడలు లేదంటుంది. మామా తినేసి వెళ్లిపోతాడు. ఈ సంభాషణ కొడుకు వింటాడు. అయితే ఆ కోడలు తన భర్త తినేందుకు వచ్చిన సమయంలో గిన్నెనిండా పెరుగు ఉంటుంది. ఆ సమయంలో కొడుకుకు తన భార్యను ఏమి అనాలో తెలియదు.
తన జీవితాన్నిత్యాగం చేసిన తండ్రికి కనీసం కప్పు పెరుగు కూడా పెట్టని పరిస్థితిలో నేను ఉన్నానా.. అని చింతిస్తాడు. దీనికి ఎలాగైనా మార్గం కనుగొనాలని ఆలోచిస్తాడు. తన భార్యని ఏమీ అనడు. తండ్రిని తీసుకుని వేరే గ్రామానికి వెళ్లిపోతాడు. తండ్రిని అక్కడే అన్ని సౌకర్యాలతో ఒంటరిగా అక్కడే ఉంచుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య అడుగుతుంది.
ఏంటీ మామయ్య ఎక్కడని కారణం చెప్పడు. తెలిదు అంటాడు. వారం గడిచిపోతుంది. ఆయినా ఆయన ఆచూకీ తెలియదు. దీంతో కోడలు ఒక రోజు గుమస్తాను అడుగుతుంది. దీనికి గుమస్తా చెబుతూ మీ మామ గారి పేరు మీద మొత్తం ఆస్తి మీ భర్త రాసిసేచ్చారు. ఆయనకు మరో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మీరు అద్దె ఇంట్లోకి మారాల్సి ఉందని చెబుతాడు. తప్పు గ్రహించిన కోడలు మామ గారి కాళ్ల మీద పడి వేడుకుంటుంది.