ఏపీ రాజకీయాల్లో "తెలంగాణ సచివాలయం “?
ఏమిటా చర్చ అంటే ఏపీ సచివాలయం 750 కోట్లతో కట్టారు. తెలంగాణ సచివాలయం 400 కోట్లతో కట్టారు అనే విషయం అది. కానీ రెండిటినీ పోలిస్తే 750 కోట్లతో కట్టిన ఏపీ సచివాలయం కన్నా, 400 కోట్లతో కట్టిన తెలంగాణ సచివాలయం సర్వాంగ సుందరంగా ఉందంటున్నారు వాళ్ళు. అలాగే 750 కోట్లతో కట్టిన ఏపీ సచివాలయం మాత్రం కమ్యూనిటీ హాల్ లా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.
అయితే ఇదంతా చూస్తున్న టీఆర్ఎస్ వాళ్లు ఎంతో సంతోష పడుతున్నారని తెలుస్తుంది. మేము వైయస్సార్సీపీని, జగన్ నో దూషిస్తున్నా సరే, ఆ పార్టీ వాళ్లు మాత్రం సచివాలయం విషయంలో మాకు సపోర్టుగా ఉంటున్నారని సంతోషం వ్యక్తం చేశారట. వైఎస్ఆర్సిపి పార్టీ తరఫునుంచి వీళ్ళు సాటిస్ఫైడ్ గానే ఉన్నా బిజెపి తరఫునుంచి మాత్రం తలనొప్పిని ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది.
దానికి కారణం బిజెపి వాళ్లు సచివాలయం గురించి రైజ్ చేసిన ఒక విషయమని తెలుస్తుంది. ఇటు టిఆర్ఎస్ వాళ్లు మిగిలిన వాళ్ళు ఇది 400 కోట్లతో నిర్మాణం జరిగింది అని చెప్తూ ఉంటే, బిజెపి వాళ్లు మాత్రం ఆ మాట నిజం కాదని అంటున్నారని తెలుస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది 400 కోట్లతో నిర్మాణం అయింది కాదు దీని నిర్మాణానికి 1600 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని అంటున్నారట. మరి దీనిపై టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారో చూడాలి.