ఇదేం తలతిక్క నిర్ణయం?: ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో?

50 ఏళ్ల క్రితమే మహిళలకు సంపూర్ణ హక్కులు ఇచ్చి అబార్షన్ అనేది వాళ్ళ వ్యక్తిగత హక్కు అని ప్రకటించింది అమెరికా. అయితే మొన్నీ మధ్యనే అక్కడ కోర్టు తీర్పు ఇచ్చింది దేశవ్యాప్త చట్టంగా అది కుదరదని తీర్పు ఇచ్చింది. దాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు రాష్ట్రాలు చట్టం చేయాలి. ఆ రాష్ట్రాలు ఇప్పుడు దీనిపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు.

ఇప్పుడు అమెరికాలోని ఫ్లోరిడాలో అబార్షన్ మీద బ్యాన్ పెట్టింది. అబార్షన్ చేసుకోవద్దని చెప్పింది. వాళ్లకు సంబంధించిన చట్టసభల్లోనే ఈ విధమైన తీర్మానం చేశారు. నిజానికి రేసిజం, హోం లెస్ నెస్, పోలీసుల హింస, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న అమెరికా ఆ సమస్యలకు పరిష్కారం చూడడం మానేసి ఆడవాళ్ళ మీద ఆధిపత్యం కోసం ప్రదర్శిస్తున్నారంటూ అక్కడ మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి.

మొన్నటి వరకూ 15 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవచ్చు, ఏడాది వరకు 24 వారాల్లో అబార్షన్ చేయించుకోవచ్చు అని అన్నారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే 12 వారాలు లేకపోతే 24 వారాల్లోపు అబార్షన్ చేసుకోవచ్చు అని ఉంది. ఇండియాలో 24 వారాల్లోపు అబార్షన్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు అని ఉంది. కానీ కాకపోతే అమెరికాలోని ఫ్లోరిడా 6 వారాల తర్వాత అబార్షన్ చేయించుకోవడానికి కుదరదు అని చెప్తుంది.

అసలు ఆరువారాలంటే ఎంత? నెలన్నర. అప్పటికి అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా తెలియదు. ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియడానికి చాలామందికి రెండు మూడు నెలలు దాకా పడితే 100లో పది మందికి మాత్రమే ఇంకా తక్కువ టైంలో తెలుస్తుంది. చాలామందికి రెండు మూడు నెలలు పీరియడ్స్ ఆగిపోయాక, ఆ తర్వాత కడుపులో వికారంగా ఉన్నప్పుడు, లేదా వాంతులు అవుతున్నప్పుడు అనుమానిస్తారు. ఆ తర్వాత టెస్ట్ చేస్తే తెలుస్తుంది ప్రెగ్నెన్సీ ఉందో లేదో. అలాంటిది రిపబ్లికన్స్ పాలించే ఫ్లోరిడా లో ఆరు వారాల్లోనే అబార్షన్ చేయించుకోమని చెప్పడం ఏంటని అక్కడ మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: