సారీ.. ఉక్రెయిన్‌కు షాక్ ఇచ్చిన ఇండియా?
అయితే ఉక్రెయిన్ ను పిలవకపోవడానికి గల కారణం అల్రడీ రష్యా జీ 20 దేశాల్లో సభ్య దేశం. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. రష్యా వచ్చిన సమయంలో అక్కడ ఉక్రెయిన్ ఉంటే ఏ విధంగా ఉంటుంది. పరిస్థితులు అసలే బాగోలేవు. యుద్ధంతో ఇరు దేశాల్లో పెద్ద సంఖ్యలో సైనికులు మరణిస్తున్నారు.
జీ 20 సదస్సు అంటే ఆయా దేశాల ఆర్థిక, సామాజిక, మౌలిక రంగాల్లో పెట్టుబడులు, వ్యాపారాలు, వాణిజ్య ఒప్పందాలు ఇలా అన్ని రంగాల్లో పరస్పరం అంగీకారంతో సాయం చేసుకోవడం. ఈ సమావేశాలు పూర్తిగా ఆయా దేశాల మధ్య ఒప్పందాలు చేసుకోవడానికి పనికొస్తాయి. ముఖ్యంగా పర్యావరణం గురించి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న తరుణంలో ఎలా అరికట్టాలో తెలుసుకోవడానికి ఈ జీ20 సమ్మిట్ ప్రధానంగా ఉపయోగపడుతుంది.
అయితే జీ20 సదస్సులో ఉక్రెయిన్ పిలిచేది లేదని ఇండియా తేల్చి చెప్పేసింది. వారం రోజుల కిందటే ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి భారత్ లో నాలుగు రోజులు పర్యటించారు. ఈ సమయంలో ఆమె కూడా భారత్ ను రిక్వెస్ట్ చేశారు. జీ 20 సమ్మిట్ కు ఉక్రెయిన్ ను ఆహ్వానించాలని కోరారు. కానీ భారత్ ఆమె విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించింది. మేం జీ 20 సమ్మిట్ కు ఉక్రెయిన్ ను పిలవడం లేదని చెప్పారు. అమెరికా, యూరప్ దేశాలు కూడా ఎంత చెప్పినా భారత్ ఒకే మాట నిలబడుతోంది.