తాలిబన్ల పాపంపై సంచలన నివేదిక?

ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా, యూరప్ సైన్యం వెనక్కి వెళ్లిపోవడం గుర్తుండే ఉంటుంది కదా. తాలిబాన్ లతో సుదీర్ఘ కాలం పాటు చర్చలు జరిపారు. జరిపి వాళ్లందరికీ వాళ్ళ రాజ్యం  వచ్చేస్తుంది, లేదంటే ఆఫ్ఘనిస్తానే ప్రభుత్వాన్ని నడుపుకుంటుంది అని చెప్పగానే సంతోషపడిపోయారు. ఎందుకయ్యా అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని అయితే కుప్పకూల్చేయొచ్చు అన్నటువంటి ధైర్యంతో.

కానీ మేము నిదానంగా రిట్రీట్ అవుతాము సో అండ్ సో డేట్ కి అని చెప్పేసరికి అమెరికా ఏం లెక్కేసుకుంది బైడెన్ లాంటి అసమర్ధుడు కారణంగా మనం నిదానంగా ఈ నెలలో అనుకుంటే మూడు నాలుగు నెలల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని  పట్టుకుపోవచ్చు అనుకుంది. కానీ ఎప్పుడైతే అమెరికా వెనక్కి తగ్గడం ప్రారంభమైంది అనగానే ఒక్కసారిగా దూకుడు పెంచేశారు తాలిబానులు.

ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలోని సైన్యాన్ని చంపేస్తూ, అక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ పాకిస్తాన్ ఇచ్చిన సపోర్ట్ తో రెచ్చిపోయారు, పరుగులు పెట్టుకుంటూ వచ్చేసారు. వారం తిరక్క ముందే ఆఫ్ఘనిస్తాన్ లోని ఎయిర్పోర్ట్స్ వాళ్ళ హస్తగతం అయిపోయినాయి. ఆ ఎయిర్ పోర్ట్లను చిట్ట చివరి నిమిషంలో తన దగ్గర ఉన్న సైన్యంతో అడ్డుపడుతూ పరుగులు పెట్టుకుంటూ జనాలను తీసుకెళ్లాల్సి వచ్చింది. తీసుకెళ్లాలి అనుకున్న వాళ్లలో 70 శాతం మందిని వదిలేసి 30% మందిని పట్టుకెళ్లారు. ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందినో ఎంతమందినో పట్టుకెళ్లారు.

ఆఫ్గానిస్థాన్ లో ఉండగా అమెరికాకు సహకరించిన వాళ్ళని తీసుకెళ్లి మిగిలిన వారిని అక్కడ వదిలేసారు. దాని పర్యవసానం చివరికి అక్కడ వాళ్ళు తాలిబాన్ల  చేతిలో హతమయ్యారు. చివరికి అక్కడ మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. విమానాలు పక్కన పరిగెత్తుకుంటూ వస్తూ తమను ఎక్కించుకోండి అని బ్రతిమాలుతూ చివరికి విమానాలు టైర్లను కూడా పట్టుకుని పైకి వెళ్లి మరీ చచ్చిపోయిన వాళ్ళని చూశాం. అసలు ప్రపంచ చరిత్రలో అట్లాంటి అరాచక పరిస్థితి వస్తుందని ఎవరైనా అనుకుంటారా అది కూడా గొప్ప దేశాలు అని చెప్పే అమెరికా, యూరప్ దేశాల విషయంలో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: