తీవ్ర గందరగోళంలో పవన్‌.. బాబుకు పిచ్చ క్లారిటీ?

తెలుగుదేశం  జనసేన మధ్య పొత్తు చర్చల కోసం చంద్రబాబునాయుడు ఆరుగురు వ్యక్తులతో ఒక టీం ను ఏర్పాటు చేశారు. గంటా శ్రీనివాసరావు, బోండా ఉమా, కన్నా లక్ష్మీనారాయణ, ఆలపాటి రాజా ఇట్లా ఆరుగురు వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇది మాత్రం ఇంకా ధ్రువీకరణ కాని విషయం. పవన్ కళ్యాణ్ ఒకపక్క బీజేపీ అధిష్టానంతో కలుస్తున్నారు. బిజెపిని ఇటు తీసుకువస్తే ఓకే కానీ, తాను బిజెపితో ఉండాలో తెలుగుదేశం పార్టీతో ఉండాలో పవన్ కళ్యాణ్ కి ఒక క్లారిటీ రావాలి.

ఆయన ఓ పక్కన బిజెపితోనే ఉన్నాను అంటున్నారు. మరో పక్కన టిడిపి తో పొత్తుల గురించి స్పష్టత కావాలి అంటున్నారు. గౌరవప్రదమైన స్థానాలు కావాలంటున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే గౌరవప్రదమైన పొత్తు కావాలంటున్నారు. ఇక్కడ గౌరవప్రదమైన పొత్తు అంటే, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల ఉద్దేశంలో సీఎం సీటు షేరింగ్, ఇంకా సీట్లలో సగం సీట్ల కన్నా తక్కువ కాకూడదని కనీసం 50 సీట్ల కన్నా తక్కువ కాకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ మరి ఈ ఉద్దేశం పవన్ కళ్యాణ్ కి ఉందో లేదో తెలియదు.

కానీ వీళ్లు కోరుకునే అంత స్థాయిలో వాళ్లు కోరుకున్నన్ని సీట్లు ఇస్తారా లేదా అనేది ఒకటి, ఇచ్చే సీట్ల సెక్షన్లో ఒక స్పష్టత రావడం ఒకటి స్పష్టత రావాలని తెలుస్తుంది. కానీ ఈ విషయం మీద మ్యాటర్ డ్రాగ్ అవుతుంది గాని ముందుకు వెళ్లడం లేదు. తెలుగుదేశం 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది‌.

మొన్న చంద్రబాబు నాయుడు గారు అదే ప్రకటన చేశారు. కానీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటే పొత్తున్న పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో నియోజకవర్గాలను తేల్చేసుకుని, దానికి సంబంధించిన అభ్యర్థులను కూడా తేల్చేసుకోవాలి. కమ్యూనిస్టులకి, సిపిఐ కి, సిపిఎం కి ఎన్ని సీట్లు, ఎన్ని అభ్యర్థులు అనేది కూడా తేల్చాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: