చంద్రబాబు వలలో పవన్‌ కల్యాణ్‌ పడినట్టేనా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 లో పవన్ కల్యాణ్ తో అరగంట పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. బీజేపీ అగ్రనేతలకు కూడా దొరకని ఈ అవకాశాన్ని పవన్ కు మోదీ ఇచ్చారు. దీంతో పవన్ కు అమాంతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊపు వచ్చింది. అప్పటికే అత్యంత ఎక్కువ పాలోయింగ్ ఉన్న సిని హిరో కావడం, దానికి తోడు బీజేపీ పార్టీ నుంచి ఏకంగా నరేంద్ర మోదీ ఇలా విడిగా కూర్చోని మాట్లాడటం కలిసొచ్చింది.


బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో మంచి పొజిషన్ లో ఉంటామని పవన్ కు  మోదీ చెప్పినట్లు తెలిసింది. మోదీ రాజకీయాల్లో తాను ఎదుర్కొన కొన్ని సంఘటనలను పవన్ కు వివరించారు గుజరాత్ లో సొంత పార్టీలోనే రెండు వర్గాలు కుమ్ములాటలు జరుగుతుండగా.. ఎలాంటి పరిస్థితి నుంచి ఇక్కడి దాకా వచ్చానో ఆ వివరాలను వపన్ కు తెలిపారు. ఒక రకంగా మోటివేషన్ స్పీచ్ లాంటిది.


ఇంతలా చెప్పినా మోదీని కాదని రాష్ట్రంలో ఉన్న బాబు వైపు పవన్ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ కూడా బీజేపీ వైపు కాకుండా టీడీపీ వైపే పవన్ కల్యాణ్ అడుగులు పడుతున్నాయి. పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని టీడీపీ వైపు మళ్లించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడనే చెప్పారు. ప్రధాని మోదీ లాంటి వ్యక్తిని కలిసి మాట్లాడిన తర్వాత కూడా పవన్ చంద్రబాబు వైపే చూస్తున్నారంటే బాబు రాజకీయ ఎత్తుగడలు వేయడంలో ఎంతో సాటి అని చెప్పొచ్చు.


రాష్ట్రంలో ఏ నాయకుడికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలి, ఎప్పుడు దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలి. ఎక్కడ తమ సత్తా చూపాలి. ఎక్కడ తగ్గాలి.  ఏ రాజకీయ పార్టీ నాయకుడితో పొత్తు అంశాలపై మాట్లాడాలో చంద్రబాబుకు తెలిసినంతగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న నాయకులకు ఎవరికి తెలియదు. పవన్ మాట వినేలా చేయడంలో మోదీ కంటే బాబే గొప్పవాడే అనొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: