ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

అమెరికా పద్ధతి ప్రపంచ దేశాల అందరికీ తెలుసు. అది అవసరమైనప్పుడు యుద్ధ చాతుర్యత, బుద్ధి చాతుర్యత లాంటివి పక్క దేశాలపై బాగా వాడుతుంది. ఇప్పుడు కూడా అలానే వాడింది. అమెరికా తన దగ్గర ఉన్న అడుగు బొడుగు ఆయుధాలన్నీ ఉక్రెయిన్ కు ఇచ్చి రష్యా అంతు చూడమని చెప్తుంది. ఏదో ఒక ఆయుధాన్ని పడేసి, కొంత ధైర్యాన్ని చెప్పేసి బలమైన శత్రువు మీదకి ఉసి కోల్పోతుంటుంది అమెరికా.

దానికి కావల్సింది యుద్ధం ప్రొలాంగ్ అవ్వడం. రష్యా దెబ్బతినడం. కానీ ఇది సాధ్యపడేలా కనపడటం లేదు. దీంతో  ఇప్పుడు పెద్ద చర్చ కు దారి తీసే పరిస్థితి ఏర్పడింది. సమస్య అయి కూర్చుంది. అమెరికా, యూరప్ దేశాలన్నీ కూడా తమ అవసరాల కోసం ఉక్రెయిన్ ని వాడుకుంటున్నాయని, రష్యా ఎప్పటినుండో చెప్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. ఇప్పుడు ఏమైంది అంటే యూరప్ దేశాల దగ్గర ఆయుధాలు ఏమీ లేవు కదా, ఉన్నటువంటి ఆయుధాలు వాళ్ళ అవసరానికి పోను రిజర్వ్ లో ఉన్న ఆయుధాలన్నీ ఉక్రెయిన్ కి పంపించేశారు. దాంతో వాళ్లు మళ్లీ కొత్త ఆయుధాలను తయారు చేయించుకోవాలి.

దానికి మొత్తం యూరోపియన్ దేశాల నుండి సంపాదించిన సొమ్ములను, దీనికోసం సంపాదించిన సొమ్ములతో ఒక్కొక్క దేశానికి ఇంత అని ఇచ్చి మీరు ఆయుధాలు కొనుక్కోండి అని చెప్పేసి ఇస్తున్నారు. అందులో ఉక్రెయిన్ కి పంపించండి కొనుక్కొని అని డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇలా డబ్బులు తీసుకున్న ఈస్టోనియా ఆ డబ్బుతో కొత్త కొత్త ఆయుధాలను తీసుకుంటుంది.

తీసుకుని అది ఉక్రెయిన్ కి పంపించకుండా,  అంటే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితో తయారు చేయించుకున్న కొత్త ఆయుధాలన్నీ తన దగ్గరే ఉంచుకుని, వాళ్ల దగ్గర ఉన్న అడుగుబడుగు మొన్ననే మిగ్, సుకోయి ఇలాంటి పాతవి తీసుకుని వెళ్లి నాటో దేశాలైన పోలాండ్,  స్లోవేకియా వీళ్ళకి పంపించింది కదా ఉక్రెయిన్ కి. అట్లాంటిదే ఈస్టోనియా కూడా చేస్తుందని తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: