వార్నీ.. అమెరికా యుద్ధ నౌకను తరిమేసిన చైనా?

సముద్ర జలాల్లో అందరికీ స్వేచ్ఛ ఉందంటూ పరుగులు పెట్టే అమెరికాని పరుగులు పెట్టించింది ఇప్పుడు చైనా. అమెరికాకు సంబంధించిన యుద్ధనౌకను తరిమికొట్టింది. ఇప్పుడు పసిఫిక్ షోడౌన్ అని పిలుస్తున్నారు ఇప్పుడు దాన్నే. సౌత్ చైనా సముద్రంలో అమెరికన్ డిస్ట్రాయర్ వస్తే  ఫిలిప్పైన్స్ దగ్గర పెట్టడానికి ప్రిపేర్ అయింది. తైవాన్ కి సహకరించడం కోసం, తైవాన్ కి దగ్గర లో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడే తీసుకువచ్చి అక్కడ హోల్డ్ చేస్తున్నారు.

వార్ ఫిటింగ్ ప్రిపరేషన్ అంటారు దీన్ని. పెద్ద ఎత్తున తైవాన్ పై చైనా దాడి చేస్తుందని భారీ ఎత్తున తీసుకొచ్చి అక్కడే పెడుతుంది. అమెరికన్ నౌక అక్కడ తిరగడానికి వీల్లేదని చైనా వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చింది. ఇది ఇల్లీగల్ ఇది చైనా జలాలంటూ వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చింది. నార్త్ ఫిలిప్పీన్స్ లోని 3మిలట్రీ సైట్స్ లో 2అమెరికా చేతిలో ఉన్నాయి. సౌత్ చైనా సీలో ఒకటి అమెరికా చేతిలో ఉన్నాయి. యుద్ధం వస్తే ఆయుధాలు, షిప్స్ అక్కడ పెట్టడానికి ఒక పక్కన అమెరికా సిద్దమవడం కోసం పెట్టిన వార్ షిప్ వెనకాల పడింది చైనాకి సంబంధించిన యుద్ధ నౌక.

అలానే తీవ్రమైన హెచ్చరికలను కూడా జారీ చేసింది. అలానే తైవాన్ లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒక పక్కన భారీగా విన్యాసాలు చేస్తుంది. 10చైనీస్ మిలిటరీ ఫ్లైట్స్, 2తైవాన్ యుద్దనౌకలు కూడా తైవాన్ సముద్ర జలాల్లో విన్యాసాలు చేస్తున్నాయి. 3నెలల్లో 292సార్లు యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలో ప్రయాణించాయి. 76యుద్దనౌకలు వాళ్ళ జలాల్లో డ్రిల్ చేశాయి. నార్త్ తైవాన్ లో యాంటీ లాండింగ్ ఎక్సర్సైజులు చేస్తున్నారు.

ఒక పక్కన తైవాన్ అధ్యక్షురాలు అమెరికా బాటలో ఉంది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని గ్వాటిమాల ప్రాంతం నుంచి టూర్ ప్రారంభించి అమెరికా వెళుతుంది. తైవాన్ అధికారులు విదేశీ శక్తులతో కూడా కలిసి వెళ్తే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక పక్కన చైనా వార్నింగ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa

సంబంధిత వార్తలు: