తాలిబాన్లకు ట్రైనింగ్‌ ఇస్తున్న మోదీ సర్కార్‌?

సాధారణంగా మన దేశం నేపాల్, భూటాన్ పోలీసులకు శిక్షణ ఇస్తుంది. గతంలో తాలిబాన్లు లేని సమయంలో కూడా ఆఫ్గానిస్తాన్ దేశానికి కూడా సైనిక శిక్షణ ఇచ్చే వాళ్లం. ప్రస్తుతం తాలిబిన్లకు దౌత్య శిక్షణ భారత్ ఇస్తుంది. దౌత్య పరంగా ఆప్గాన్ దేశానికి ఎవరైనా విదేశీ అతిథులు వస్తే ఎలా చేయాలి. ఆఫ్గాన్ దేశానికి చెందిన మంత్రులు కానీ రాయబారులు కానీ విదేశాలకు వెళ్లినప్పుడు ఎలా మెలగాలి అనే శిక్షణ ఇప్పుడు భారత్ ఆఫ్గాన్ లోని తాలిబాన్ల ప్రభుత్వానికి ఇస్తుంది.

తాలిబాన్ల ప్రభుత్వం ఉంది కదా వారికి ఎందుకు సాయం చేస్తున్నారని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ దేశ సరిహద్దులో ఉన్న ఆఫ్గాన్ కు దౌత్య పరమైన విషయాల్లో సాయం చేయకపోతే రాబోయే రోజుల్లో వారి ప్రవర్తన మారవచ్చు. వారికి మంచి విధానాలు నేర్పడంలో తప్పేముంది. అది మనకు మంచే చేస్తుందని కొందరి అభిప్రాయం.

గతంలోనూ నేపాన్, భూటాన్ దేశాల పోలీసులు ఢిల్లీలో శిక్షణ తీసుకునేవారు. వారి శిక్షణ పూర్తయిన తర్వాత ఆ దేశంలో విధులు నిర్వర్తించేవారు. నేపాల్, భూటాన్ లు కూడా భారత్ సరిహద్దులో ఉండే దేశాలు కనక మనం సైనిక పరంగా శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది. తాలిబాన్లు ప్రజలు ఎన్నకున్న వారు కాదు. వారు అడవిలో ఉండి తుపాకీలు పట్టుకుని అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఆఫ్గాన్ లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

అలాంటి ఆఫ్గాన్ ప్రభుత్వానికి దౌత్య పరంగా కొన్ని సంస్కరణలు నేర్పడం అనేది భారత్ తనకు లాభం చేకూరుతుందనే చూడాలి. ఇలాంటి విషయాలను చెప్పడం ద్వారా తాలిబాన్లలో కూడా విదేశీయుల పట్ల ప్రవర్తించాల్సిన తీరులో మార్పు కచ్చితంగా వస్తుంది. ఆ మార్పు వస్తేనే విదేశీయులు ఆ దేశంలో వివిధ సంస్థలను నెలకొల్పుతారు. అప్పుడు ఆఫ్గాన్ లో కొన్ని మార్పులు వస్తాయి. దౌత్య పరంగా విజయం సాధిస్తే ఎన్నో కష్టాల నుంచి బయటపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: