ప్రపంచం మారుతున్నా.. ఆ ఛానల్‌ మారదా?

భారత్ లో ఉన్న దూరదర్శన్ అనే చానల్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో పనిచేసే ఉద్యోగులకు ఎక్కువ జీతం వస్తుంది. బయట టీవీ ఛానళ్లలో పని చేసే వారికి మాత్రం అంత ఎక్కువ రాదు. కానీ దూరదర్శన్ లో పనిచేసే వారు రోజు ఇచ్చే స్టోరీ ఒకటే ఉంటుంది. అయినా ఆ స్టోరీ కూడా పెద్దగా ప్రభావం చూపేంతలా ఉండవు.

దేశంలో అనేక వివాదాలు, అవినీతి జరుగుతున్నాయి. కానీ వాటిపై ఒక్క స్టోరీ కూడా ప్రసారం చేయరు.  చాలామంది బీబీసీపై నిందలు వేస్తూ ఉంటారు. బీబీసీ చేసే పనుల్ని తిట్టి పోసే వారు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు బీబీసీ ఒకటే ఉండేది. కానీ ఇప్పుడు చాలా టీవీ చానళ్లు ఉన్నాయి. వాటిలో ఏ మీడియా చానల్ తప్పు చేసినా దాన్ని కడిగి పారేసే విధానం వచ్చింది. వారి తప్పొప్పులను ఎత్తి చూపే విధానం ఒకటుంది. ప్రజల చెంతకు చేరేలా నిజనిజాలు నిగ్గు తేల్చేలా చెప్పే అవకాశం ఉంటుంది.

ఇదే సమయంలో ప్రపంచ దేశాల్లో ఇన్వెస్టిగేటివ్ స్టోరీలను దూరదర్శన్ ఎందుకు రాయలేకపోతుంది. ఎందుకు సెన్సెషనల్ ఇంటర్వ్యూలను చేయలేకపోతుంది. అప్ డేట్ కాకుండాా ఉండడానికి కారణం ఏమిటి? ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న చానల్ కాబట్టి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై రాయకూడదని ఏమైనా ఉందా?

అయితే ప్రైవేటు టీవీ చానల్ లో కెమెరామెన్ కు రూ. 50 వేల జీతం ఉంటే దూరదర్శన్ లో పనిచేసే కెమెరామెన్ కు రూ.లక్ష వరకు జీతం ఉంటుంది. ఒక ఔట్ పుట్ ఎడిటర్ కు దూరదర్శన్ లో 2 లక్షల జీతం ఉంటుంది. ఇంత జీతాలు ఉన్నా ఎందుకుని బీబీసీ టైప్ లో ఎటాకింగ్ కథనాలు వేయడంలో విఫలమవుతుంది. బీబీసీ రేంజ్ లో ప్రత్యేక కథనాలు మీడియా లో ప్రసారం చేసేలా దూరదర్శన్ ఎదిగి విప్లవాత్మకమైన స్టోరీలు రాసే రోజులు ఎప్పుడు వస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: