ప్రపంచానికి పెనుముప్పు: ముంచెత్తుతున్న సముద్రాలు?
ఆర్కిటిక్ బ్లాక్ దెబ్బకి ఇంగ్లాండ్ లాంటి పలు యూరప్ దేశాలను 40 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా చలి, మంచు వణికించాయి. అమెరికా పై విరుచుకుపడ్డ బాంబ్ సైక్లోన్ మంచు తుఫానుగా మారి దేశాన్ని అల్లకల్లోలం చేసి పడేసింది. ఈ ప్రళయాలతో పాటు మరొక నిశ్శబ్ద ప్రళయం నెమ్మదిగా ముంచుకొస్తుంది. అదే సముద్ర మట్టాల్లో అనూహ్య పెరుగుదల. ప్రపంచవ్యాప్తంగా అన్ని తీరప్రాంతాలలోనూ ఈ ప్రమాదం చోటు చేసుకుంటుంది.
ముఖ్యంగా మధ్యధరా ప్రాంతాల్లో ఈ సముద్రమట్టాలు మరీ ప్రమాదకరస్థాయిలో 20 ఏళ్లలో 8 సెంటీమీటర్లు లెక్క విపరీతంగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా రెండు దశాబ్దాల తో పోల్చితే ఇటలీలోని సముద్ర మట్టం, స్పెయిన్ లోని సముద్ర మట్టం కన్నా రెండింతలు పెరిగినట్లు పరిశోధకులు తేల్చారు. ఆడ్రియాడిక్ ఏజీఎన్, పదకొండు రెట్లు టైమ్స్ సముద్ర మట్టాలు 20 ఏళ్లలో 8 సెంటీమీటర్లకు పైగా పెరిగింది. ఆ పెరుగుదల రేటు కూడా గతంలో కన్నా మరింత వేగం పుంజుకోవడం.. అది మరింత ప్రమాదకరమైన విషయం.
తమ అధ్యయనంలో అలలు, ఆటుపోట్ల గణాంకాలతో పాటు మంచు కరిగే రేటు లాంటివి ఉపగ్రహాలు తీసిన ఫోటోల ద్వారా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. 1989 తర్వాత మధ్యధరా సముద్రమట్టం వేగంగా పెరుగుతుందని తమ అధ్యయనంలో తేల్చారు. ఈ అధ్యయనాన్ని ఒక జర్నల్ ప్రచురించడంతో పర్యావరణానికి సంబంధించిన ఈ ప్రమాదకరమైన విషయం ప్రపంచానికి వెల్లడైంది.