పోలవరంపై కేంద్రం సంచలన నివేదిక.. ఏముందంటే?

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం సంచలన విషయాలు బయటపెట్టింది. జలశక్తి శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కీలక విషయాలు ప్రస్తావించారు. దీనిలో ఏముందంటే.. పోలవరం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయట. 2024 మార్చి నాటికి పోలవరం ప్రాజక్టు పూర్తి కావాల్సి ఉన్నా... వరదల కారణంగా జాప్యం జరుగుతున్నట్లు కేంద్రం అంచనా వేసిందట. తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజక్టు నిర్మాణం 2024 మార్చి నాటికి, డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్  2024 జూన్  నాటికి పూర్తి కావాల్సి ఉందని..... ఐతే 2020, 2022 సంవత్సరాల్లో గోదావరికి వచ్చిన వరదల కారణంగా... ప్రస్తుత ప్రతిపాదిత షెడ్యూల్ జాప్యం జరగవచ్చని కేంద్రం భావిస్తోంది.

పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు స్పిల్ వే, ఎగువ కాఫర్  డ్యాం గ్యాప్ -3, కాంక్రిట్  డ్యాం, ఎర్త్  కం రాక్ ఫిల్  డ్యాం, డయాఫ్రం వాల్  గ్యాప్ -1 నిర్మాణాలు పూర్తైనట్లు కేంద్రం తెలిపింది.మరో ఎర్త్  కం రాక్ ఫిల్  డ్యాం.. గ్యాప్ 1, 3ల నిర్మాణం, ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాస కల్పన కార్యక్రమాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. 2013-14 నాటి ధరల ప్రకారం ప్రాజక్టు నిర్మాణానికి 29,027.95 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రం తెలిపింది.  2017-18 నాటి ధరల ప్రకారం... ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా... 47,725.74 కోట్లకు పెరిగిందని కేంద్రం తెలిపింది.

2016 సెప్టెంబర్  30 నాటి ఆర్ధిక శాఖ ఉత్తర్వుల ప్రకారం 2014 ఏప్రిల్  1 నుంచి సాగునీటి ప్రాజక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చుని చెల్లిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. పోలవరం ప్రాజక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం నుంచి వచ్చిన సిఫారసులు, బిల్లుల ఆధారంగా.. చెల్లింపుల ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తెలిపింది. పోలవరాన్ని జాతీయ ప్రాజక్టుగా ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు 13,226.043 కోట్ల రూపాయలు కేంద్రం తిరిగి చెల్లించిందట. ఆ తర్వాత... ఏపీ  ప్రభుత్వం చెల్లింపుల కోసం పీపీఏకి 483 కోట్ల రూపాయల బిల్లులు సమర్పించిందట. దీన్నిబట్టి చూస్తే.. 2024 నాటికి పోలవరం పూర్తి కావడం అసాధ్యం.. మరి పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: