విశాఖ టూర్‌ తో మోదీ సాధించింది ఏమిటి?

ప్రధాని మోదీ ఏపీలో రెండు రోజుల పర్యటించారు. ఈ పర్యటన విజయవంతం అయ్యిందా.. అంటే.. అపూర్వంగా జరిగిందని బిజెపి నేతలు ్ంటున్నారు. దీనిపై స్పందించిన ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. వ్యక్తిగతంగా నా అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగిందని అంటున్నారు. అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు జరగటం రాష్ట్రాభివృద్ధికి మోదీ ఇస్తున్న సహకారానికి నిదర్శనమని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అంటున్నారు.

ప్రధాని పర్యటనలో రైల్వే జోన్ ఉంటుందా లేదా వంటి చర్చలు సాగాయని.. కానీ..  ప్రధాని రాకకంటే ఒక రోజు ముందే ఈనెల 10న జోన్ నిర్ధారిస్తూ నోటిఫికేషన్ వెలువడిందని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.  రైల్వే మంత్రి జోన్ ప్రధాన‌కార్యాలయం ఎక్కడ నిర్మించాలో మంత్రి తనిఖీ చేశారని..  నిర్మాణ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. నేషనల్ ఇంటర్నెట్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా ఎనిమిది సెంటర్లలో ఒకటి విశాఖకు దక్కిందని... ఇది నెట్ కల్పనకు ఇది అత్యవసరమని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవే ఈ శాఖా చూస్తున్నారని... మరో మూడు నెలల్లో ఇది విశాఖలో సాకారం అవుతుందని.. దీని ద్వారా ఐటి పరిశ్రమ అభివృద్ధికి ఊపు వస్తుందని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ప్రధా‌ని పర్యటన సందర్భంగా బిజెపి కోర్ కమిటీతో గంటన్నర చర్చించారని... అదే రాత్రి ప్రెస్ మీట్లో ఆ వివరాలు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. కానీ కొన్ని మీడియాలు అక్కడ ఏదేదో జరిగిందని కొందర్ని టార్గెట్ చేస్తూ అసత్యాలు రాశారని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు.

చక్కని వాతావరణంలో కోర్ కమిటీ సభ్యుల్లో చాలా మంది తమకు వచ్చిన ఆలోచనలు పంచుకున్నారని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. అక్కడ విమర్శలు చేయగలంత స్థాయి ఎవరికీ లేదని...  కొత్త ఒరవడితో ప్రజలకు సేవలందటమే లక్ష్యంగా పని చేయాలని‌ ప్రధాని సూచించారని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి దోహద పడేలా ప్రధాని యాత్ర సాగిందని..  శోభా యాత్ర మీద పోలీసులు అనేక ఆక్షలు విధించినా అది విజయవంతం అయిందని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆనందం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: