విశాఖలో మోదీ.. సభ విశేషాలు ఇవే?

విశాఖలో ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాని బహిరంగ సభ జరగబోతోంది. ఈ ఉదయం 7 గంటల నుంచి బహిరంగ సభ ప్రాంగణానికి ప్రజలు చేరుకునేట్టుగా చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాలకు చేరుకున్నట్టుగా పోలీసుల ప్రణాళిక రూపొందించారు. ఈ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు.


విశాఖ నగరంలోకి భారీ వాహనాలు రాకుండా ఈ తెల్లవారుజాము నుంచే జాతీయ రహదారిపై వాహనాలు మళ్లింపు ప్రారంభించారు. నగరంలోని మద్దిలపాలెం వాల్తేరు వైపు వెళ్లే అన్ని దారులలోను వాహనాలు మళ్లిస్తున్నారు. బహిరంగ సభ కోసం ప్రధాని పర్యటన కోసం దాదాపు పదివేల మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సభ ప్రధాన ప్రాంగణానికి వచ్చేవారిని పూర్తి తనిఖీలు చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరిని డి ఎఫ్ ఎం బి ద్వారా తనిఖీ చేసిన లోపలికి అనుమతిస్తున్నారు.

సభా ప్రాంగణంలో 60 వేల మంది వరకు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అనుబంధంగా ఉన్న మరో 13 ఎకరాల స్థలంలో విశాలంగా ఏర్పాటు చేసిన టెంట్లు డిజిటల్ స్క్రీన్ ల ద్వారా ప్రధాని బహిరంగ సభను వీక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఇక ప్రధాని సభ కోసం  ప్రాంగణంలో మూడు వేదికలు చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధానమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రమే ఉంటారని అధికారులు చెబుతున్నారు.

పక్కనే ఉన్న మరో వేదికపై 100 మందికి పైగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వేదికపై  రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్యాబినెట్ హోదా ఉన్న వారు ఇక్కడ ఆసీనులు అవుతారని అధికారు చెబుతున్నారు.  60 మంది వరకు పట్టే మరో వేదికపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారులు రైల్వే ఉన్నతాధికారులు ఉంటారని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: