భూఅక్రమాల్లో జగన్‌ భార్య హస్తం.. టీడీపీ సంచలన ఆరోపణ

విశాఖలో భూ కుంభకోణాలు రాజకీయంగా పెను వివాదాలు సృష్టిస్తున్నాయి. తాజాగా మధురవాడ సర్వే నంబర్ 336 లో భూముల కుంభకోణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి హస్తముందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి వరసకు తమ్ముడైన అనిల్ రెడ్డికి క్యాపిటల్  లక్ష్య  పేరుతో  ప్రకటన ఇవ్వడంతో అసలు విషయం బయట పడిందని  మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

మధురవాడ భూ కుంభకోణం పై సి బి ఐ తో విచారణ జరిపిoచాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు కు మొత్తం పూర్తి ఆధారాలతో ఈ అంశాన్ని ఇస్తామని చెప్పారు. ఈ భూ కుంభకోణాలు పై ప్రధాని దగ్గరకు విషయం తీసుకుని వెళ్ళాలి అన్నారు.  ఈ భూముల్లో  సుమారు గా వెయ్యి కోట్లు  కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. 2019లో 93 కోట్లకు రమేష్ కుమార్ బంగూరికి  చెందాల్సిన భూముని కుట్రచేసిలాగేసుకున్నారని  మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు.

మూడేళ్ళ క్రితం జరగాల్సిన రిజిస్రేషన్ ఇప్పుడు చేయడంలో మతలబు ఉందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి , అధికారి ధనుoజయరెడ్డిని విశాఖకు పంపించి కధ నడిపిoచారని బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు. ఈ ఆరోపణలతో ఇప్పుడు రాజకీయంగా పెను వివాదం రేగే అవకాశం కనిపిస్తోంది.

ఇటీవలి కాలంలో టీడీపీ ఏమాత్రం అవకాశం దక్కినా సీఎం జగన్ భార్యపై ఆరోపణలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే ఆ పార్టీ నేతలు భారతి పేటీఎం అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ చేశారు కూడా. తాజాగా ఇప్పుడు సీఎం భార్య హస్తం ఉందని ఆరోపించడం కూడా రాజకీయంగా ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది. మరి ఈ ఆరోపణలపై వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందన్నది వేచి చూడాలి. ఇటీవల విశాఖలో విజయసాయిరెడ్డి కుమార్తె కంపెనీ భూములు కొందన్న ఆరోపణలు కూడా సంచలనం సృష్టించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: