నాని ప్యారడైజ్ నుంచి BTS వీడియో వైరల్..!

Divya
నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన దసరా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో నాని రేంజ్ మారిపోయింది. మళ్లీ వీరి కాంబినేషన్లోని "ది ప్యారడైజ్" సినిమా సిద్ధమవుతోంది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల.. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఆ తర్వాత రెండవ చిత్రమే ది ప్యారడైజ్ ఓకే చేయడంతో ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. అలాగే చిరంజీవితో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


ఈ రోజున డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా ది ప్యారడైజ్ చిత్రం నుంచి  ఒక ఇంట్రెస్టింగ్ BTS వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో చూస్తూ ఉంటే డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నారో కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా పట్ల ఆయనకున్న డెడికేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తోందని నాని అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.  ఈ చిత్రంలో నాని జడల్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. చాలా డిఫరెంట్ గెటప్ లో మాస్ హీరోగా కనిపించబోతున్నారు.


ఇప్పటివరకు విడుదలైన ప్రమోషన్స్ వీడియోలు కూడా భారీ హైప్ తీసుకోవచ్చాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన BTS వీడియో కూడా హైలెట్ గా మారింది.ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందిస్తున్నారు. ది ప్యారడైజ్ చిత్రాన్ని దసరా సినిమాకి మించి మరి విజయాన్ని అందించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో హీరో నాని సెలెక్ట్ చేసే కథలు కూడా చాలా విభిన్నంగా ఉండడమే కాకుండా అభిమానుల చేత ప్రశంసలు అందుకునేలా ఉన్నాయి. అలా వరుస హిట్లతో కలెక్షన్స్ పరంగా కూడా బాగానే రాబడుతున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా విలన్ గా నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు చిత్రాన్ని మార్చి 26- 2026 న విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: