జగన్‌.. సర్పంచ్‌లను బిచ్చగాళ్లను చేస్తున్నారా?

ఏపీలో ఇప్పుడు సర్పంచ్‌లు రోడ్డెక్కుతున్నారు. మా నిధులు మాకు ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నారు. చివరకు బిచ్చగాళ్లుగా మారి.. వీధుల్లో జోలె పడుతున్నారు. గ్రామాలను అభివృద్ధి చేయాలంటే నిధుల్లేవని వాపోతున్నారు. ఇందులో వైసీపీ సర్పంచ్‌లు కూడా ఉండటం విశేషమే. ఇదంతా పంచాయతీల నిధులను సర్కారు ఇతర కార్యక్రమాలకు మళ్లించడం వల్లే జరుగుతుందంటోంది తెలుగుదేశం. పంచాయతీలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

సర్పంచులను జగన్ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. హక్కుల కోసం గళమెత్తిన సర్పంచ్‌లను నిర్బంధించడం మాని.. నిధులివ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. సర్పంచులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీ ఖాతాల్లో వేయాలని చంద్రబాబు కోరారు. హక్కుల కోసం గళమెత్తిన సర్పంచ్ లపై నిర్బంధాలు కాదు...నిధులు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు.

ఏపీ రాష్ట్రంలో పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతో పంచాయతీలు తమ ఉనికి కోల్పోతున్నాయని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజ్యంగబద్దంగా లభించిన హక్కుల కోసం సర్పంచ్ లు చేపట్టిన నిరసనలను ప్రభుత్వం అణిచివేయడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

సమస్యలపై గళమెత్తిన సర్పంచులపై కేసులు, నిర్బంధాలు.. వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సర్పంచ్ ల సంఘం డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని అవి వారి హక్కులని గుర్తించాలని  టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలతో పాటు, గ్రామీణ వ్యవస్థలో కీలకమైన పంచాయతీలు నాశనం అవుతున్నాయన్న టీడీపీ అధినేత చంద్రబాబు... ప్రభుత్వం దారి మళ్లించిన 14,15 ఆర్థిక సంఘం నిధులు రూ. 8700 కోట్లు తిరిగి గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చెయ్యాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: