ఔనా.. చంద్రబాబు గతం మరిచిపోయారా?

టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. అయితే.. ఆ సమయంలో ఆయన జగన్ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేశారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోలేదని.. సీఎం జగన్ హెలికాప్టర్లలో తిరుగుతూ షో చేస్తున్నారని.. ఎలాంటి సహాయ చర్యలు చేయలేదని.. విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే పోలవరం జిల్లా చేస్తానని హామీ ఇచ్చారు. అయితే.. చంద్రబాబు పర్యటనపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

చంద్రబాబును మించిన నటుడెవరు అంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి పేర్ని నాని.. చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు, అధికారం పోగానే ఏం మాట్లాడుతున్నాడో చూడండి... జగన్‌ గారిని విమర్శిస్తున్నాడు కదా... ఆయన పిల్లలను ఎత్తుకుంటున్నాడని, వారికి పెన్నులు ఇస్తున్నారని, బాధితులతో సెల్ఫీలు దిగుతున్నారని ఏదేదో మాట్లాడుతున్నారు కదా.. అసలు  నిజానికి చంద్రబాబును మించిన నటులు ఎవరుంటారు..  ఆయనను మించిన నటుడు మరెవరూ లేరు కదా..  చివరకు ఆయనకు పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు కూడా ఈ మాట అన్నారు కదా... తనను మించిన నటుడు చంద్రబాబు అని అంటూ మాజీ మంత్రి పేర్ని నాని గతం గుర్తు చేశారు.

అంతే కాదు.. చంద్రబాబు గతం పూర్తిగా మర్చిపోయారని మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు ఒక గజనీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. గతంలో తాను చేసినవన్నీ మర్చిపోయాడని... ఆయనకు సరైన పేరు ‘నారా గజనీ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. 1996లో వరదలు వస్తే ఎటపాక మునిగిపోతే, అప్పుడు ఎందుకు అక్కడికి పోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబే సీఎం కదా.. అయినా ఎందుకు అక్కడికి పోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

చంద్రబాబు... ఎవరికి ఏదీ గుర్తుండదు అనుకుంటాడని... నిన్న 1986 వరదలను ప్రస్తావించాడు కదా.. . మరి 1996 వరదల గురించి ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.  అప్పుడు కూడా దాదాపు ఇదే స్థాయిలో వరద వచ్చిందని.. అప్పుడు పోలవరం కూడా లేదు.. అయినా ఇలాగే ఊళ్లన్నీ మునిగిపోయాయి కదా అంటూ మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: