జగన్‌ మగాళ్లను దోచి ఆడాళ్లకు పెడుతున్నారా?

ప్రతిపక్షం అన్నాక విమర్శలు చేస్తూనే ఉంటుంది. అయితే ఈ సారి తెలుగు దేశం నేత ఒకరు వెరైటీ విమర్శ చేశారు.. అదేంటంటే.. జగన్‌ మగాళ్లను దోచి ఆడాళ్లకు పెడుతున్నారట... గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రెస్ మీట్ పెట్టి ఈ విమర్శలు చేశారు.
రాష్ట్రంలో మద్యం తో పాటు గంజాయి కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారన్న ఆలపాటి రాజా.. . మహిళల పుస్తేలను కూడా అమ్ముకుంటున్నారని.. జగన్.. నవ రత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

అంత వరకూ అందరూ అనేవే..కానీ.. మద్యం ద్వారా సీఎం జగన్‌ మగాళ్ల ను దోచుకోని మహిళలకు సంక్షేమ పధకాలు ఇస్తున్నారని ఆలపాటి రాజా విమర్శించారు. మద్యం పై అప్పులు తేవడం సిగ్గు చేటన్న ఆలపాటి రాజా.. రాష్టాన్ని మద్యం మత్తులో ముంచాలని జగన్ పధకం వేశారన్నారు.
ప్రభుత్వ ఆధాయం పై దొంగ లెక్కలు చూపుతోందని.. వైసిపి ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

అంతే కాదు.. జగన్ రెడ్డి మోసపూరిత పాలన చేస్తున్నాడని.. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలో చేసే పనులకు పొంతన లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. మద్య నిషేదం పై జగన్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు చెప్పాడని.. మద్యపాన నిషేదం అంశం ఏమైందో సమాదానం చెప్పాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా నిలదీశారు. టీచర్ లతో మద్యం  అమ్మించిన ఘనత జగన్ రెడ్డి కే దక్కుతుందని.. రాష్ట్రంలో వీధివీధిన మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు.

ఏపీలో 24 బై 7 మద్యం అన్ని చోట్లా అందుబాటులో ఉంటోందని.. మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. అయితే సీఎం జగన్ మగాళ్లను దోచి మహిళలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని విమర్శించడం ఒక విధంగా జగన్‌ కే ప్లస్ అవుతుందేమో అని పాపం.. మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆలోచించి ఉండరు. కానీ.. మగాళ్లను దోచి ఆడాళ్లకు పెడుతున్నారనే అంశాన్ని మాత్రం బాగానే హైలెట్ చేశారు. కాస్త కొత్తగా ఆలోచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: