తెలంగాణ దూసుకుపోతుంటే.. ఏపీ వెనుకబడుతుందా?

రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో పోలికలు రావడం సహజం.. నిన్న మొన్నటి వరకూ ఉమ్మడి రాష్ట్రంగా ఉండటం వల్ల ఈ పోలికలు సాధారణమే.. అందుకే.. ఏ నివేదిక వచ్చినా ఏపీ స్థానం ఏంటి.. తెలంగాణ ప్లేస్ ఏంటి అన్న చర్చ వస్తుంటుంది. ఇటీవల నేషనల్‌ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ డెలివరీ అసెస్‌మెంట్‌..ఎన్‌ఈఎస్‌డీఏ.. 2021 ప్రకటించిన ర్యాంకుల విషయంలోనూ ఇదే చర్చ వచ్చింది. ఈ ర్యాంకుల్లో తెలంగాణ 5వ స్థానంలో నిలవగా.. ఏపీ 8వ స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఆన్‌లైన్‌ పద్ధతిలో అందిస్తున్న సేవలను బేరీజు వేసి సర్వే నిర్వహించి వాటి ఆధారంగా కేంద్రం ఈ ర్యాంకులు ఇస్తుంటుంది. అందులోనూ రాష్ట్రాలను హిమాలయ - ఈశాన్య, కేంద్రపాలిత ప్రాంతాలు, గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బిలుగా విభజించి ర్యాంకులు ఇస్తుంది. అందులో ఏపీ, తెలంగాణ గ్రూప్‌-ఎ కేటగిరీలో ఉంటాయి. ఈ గ్రూప్‌ ఏలో మొత్తం 10 రాష్ట్రాలు ఉంటాయి. వాటిలో ఈ గవర్నెన్స్ విభాగంలో కేరళ, తమిళనాడు, పంజాబ్‌లు ఫస్ట్ మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

ఇక తెలంగాణ ఐదో స్థానం,  ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో ఉన్నాయి. ఈ-గవర్నెన్స్‌ ద్వారా ఆర్థిక వ్యవహారాలు, స్థానిక సంస్థలు, విద్యుత్తు, తాగు నీరు, ఇతర గృహావసర సేవలను జనం వాడుకుంటున్నారు. అన్నిసేవలూ ఒకేచోట అందించే ఇంటిగ్రేటెడ్, సెంట్రలైజ్డ్‌ పోర్టల్‌కు జనం  ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా రాష్ట్రాల మధ్య ర్యాంకులు ఇచ్చే సంప్రదాయాన్ని కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం 2019లో ప్రారంభించింది.

ఎన్‌ఈఎస్‌డీఏ అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఇలా ర్యాంకులు ఇస్తోంది. దేశవ్యాప్తంగా అందుతున్న డిజిటల్‌ సేవలను అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా 2021 జూన్‌లో ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.. 2022 మే వరకు ఉన్న డేటాను సేకరించి విశ్లేషించి... అందుబాటు, విషయ లభ్యత, సులభ వినియోగం, సమాచార భద్రత, గోప్యతల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించింది. తెలుగురాష్ట్రాల మధ్య ర్యాంకుల్లో కేవలం 3 స్థానాలే తేడా ఉన్నా.. టీడీపీ అనుకూల మీడియా ఏపీ వెనుకబడిపోయిందన్న రీతిలో వార్తలు రాసుకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: