జూబ్లీహిల్స్ రేప్‌ కేసు.. బీజేపీ, కాంగ్రెస్‌ దూకుడు?

జూబ్లీ హిల్స్ రేప్ కేసు క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ కేసు పై విపక్షాలు దూకుడు పెంచాయి. నిన్న బీజేపీ జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ ముందు వీరంగం వేసిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కాంగ్రెస్ నేతలు కూడా హోమ్ మంత్రిని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే.. హోంమంత్రిని కలిసేందుకు వెళ్లిన మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు.

అడ్డుకున్న పోలీసులపై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో రేణుక చౌదరీ వాగ్వాదం పెట్టుకున్నారు. రాష్ట్రంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే హోమ్ మంత్రిని కలిసేందుకు వస్తే అడ్డుకుంటారా అని నిలదీశారు. మైనర్ బాలిక ను పబ్ లోకి అనుమతి ఇచ్చిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రశ్నించారు. పోలీస్ లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు అంటూ ఏసీపీ పై మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంఘటన జరిగి నాలుగు రోజులు అయిన కూడా పూర్తి సమాచారం లేకపోవడం ఏంటని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రశ్నించారు. పబ్ పై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి నిలదీశారు. రాష్ట్రంలో ఇంత దారుణం జరుగుతుంటే ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి నిద్ర పోతున్నారని రేణుక చౌదరి మండిపడ్డారు.

ఈ జూబ్లీహిల్స్ గ్యాంగ్‌ రేపు కేసు తెలంగాణ సర్కారుకు గుది బండగా మారుతోంది. ఈ కేసులో ప్రముఖులు ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా హోంమంత్రి మనవడే ఉన్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఉపేక్ష వద్దని ఏకంగా కేటీఆర్‌ సోషల్ మీడియాలో  పోస్టు పెట్టడం.. దానికి హోంమంత్రి కూడా అలాగే సర్‌ అంటూ బదులివ్వడం కూడా పరిస్థితి తీవ్రతను చెబుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: