రేణుకా చౌదరి ఇంట్లో ఎన్ని కులాలు ఉన్నాయో తెలుసా?
అయితే.. రేణుకా చౌదరి తన కులం గురించి మాట్లాడటం ఇది కొత్త కాదు.. దాదాపు 8 నెలల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చౌదరి అనే తోక పేరు చివర ఉండటం వల్ల తనకు చాలా నష్టమే జరిగిందన్నారు. అసలు తన తండ్రి ఓ మిలటరీ వ్యక్తి అని.. ఆయన కారణంగా తమకు దేశ భక్తి, జెండా పై గౌరవం, డిసిప్లన్ తప్ప.. కులాల గురించి చాలా కాలం వరకూ తెలియదని చెప్పుకొచ్చారు. తాను నాలుగైదు రాష్ట్రాల్లో తిరిగి చదవుకున్నానని.. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగిన అనేక సంస్కృతులు గురించి తెలుసుకున్నానని అన్నారు.
తనని చౌదరి అని విమర్శించే వాళ్లకు అసలు విషయం తెలియదని ఆమె తన కుటుంబం గురించి చెప్పుకొచ్చారు. తన కుటుంబంలో అనేక కులాల వాళ్లు ఉన్నారని.. తన కుటుంబంలో ఒక్క సిక్కు లేడన్న బాధ మాత్రం ఉందని తాను తన కుటుంబ సభ్యులతో అంటుంటానని జోక్ చేశారు. సిక్కుల దేశ భక్తి.. వారి సంస్కృతి చాలా గొప్పవని.. అందుకే ఓ సిక్కును పెళ్లి చేసుకోమని తన కుటుంబ సభ్యుల్లోని ఆడపిల్లలకు చెబుతానని ఆమె తమాషాగా అన్నారు.
అంతే కాదు.. అసలు చౌదరి అనేది కేవలం కమ్మల పదం కాదని.. అనేక జాతుల్లో చౌదరిలు ఉన్నారని తెలిపారు. సిక్కుల్లోనూ, బ్రాహ్మణుల్లోనూ.. ఇంకా అనేక మతాల్లో చౌదరి అన్న పదం ఉందని.. కానీ.. తెలుగు రాజకీయ నాయకులకు కమ్మ కులం ఒక్కటే తెలుసని రేణుకా చౌదరి విమర్శించారు.