లోకేశ్‌.. 'బాబు'ను చూసి నేర్చుకో..ఏంటీ పీకుడు భాష?

నారా చంద్రబాబు.. రాజకీయంగా ఆయనతో విభేదించే వారు ఉండొచ్చు కానీ.. చంద్రబాబు సహజంగా ఎప్పుడూ రాజకీయాల్లో దిగజారుడు పదజాలం కానీ.. చిల్లరగా కానీ వ్యవహరించరు. ఆయన కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు.. పద్దతులు పాటిస్తారు.. అన్  పార్లమెంటరీ పదాలు చంద్రబాబు నోట సాధారణంగా రావు.. అదీ ఆయన ప్రవర్తన. కానీ.. ఆయన కుమారుడు నారా లోకేశ్ మాత్రం తండ్రి నుంచి ఇలాంటి మంచి సాంప్రదయాం మాత్రం నేర్చుకోలేదనే చెప్పాలి.


తాజాగా మంగళగిరి మండలం కురగల్లులో పర్యటించిన లోకేష్....కరోనాతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ఓ మీడియా ప్రతినిధి జగన్ మంత్రి వర్గ విస్తరణ గురించి అడిగాడు.. అప్పుడు లోకేశ్ ఏమన్నారంటే.. అదో వ్యవస్థీకరణా.. ఇప్పుడు ఉన్న మంత్రులు ఏం పీకారండీ.. ఇప్పుడు కొత్తగా మళ్లీ వాళ్లు వచ్చి ఏం పీకుతారంట.. ఈ జగన్ ఈ మూడేళ్లు ఏం పీకాడని మళ్లీ గెలిపించాలి.. ఇదిగో ఇలా సాగిపోయింది నారా లోకేశ్ వాగ్ధాటి.


అభివృద్ధిలో నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ ను ఆదర్శంగా తీసుకుంటే ప్రస్తుత సీఎం జగన్ మాత్రం శ్రీలంకను అనుసరిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. కురగల్లులో 250 ఇళ్లను కూల్చేందుకు అధికారులు నోటీసులు ఇవ్వగా.. బాధితుల తరఫున నారా లోకేష్ కోర్టులో కేసు వేసి.. కూల్చివేత ఆపేయించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఆ గ్రామంలో పర్యటించారు.


చంద్రబాబు మహిళలకు పసుపు, కుంకుమ ఇస్తే.. జగన్ వాటిని తుడిచేస్తున్నారని నారా లోకేశ్  ఆరోపించారు. బాదుడే బాదుడు అంటూ విద్యుత్, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారని విమర్శలు గుప్పించారు.  నారా లోకేశ్ తరచూ ఇటీవల ఇలాంటి పదజాలం వాడుతున్నారు. ఆయన తన సామాజిక మాధ్యమాల్లోనూ తరచూ ఇలాంటి భాషనే వాడుతున్నారు. ఇది నారా లోకేశ్‌ ఇమేజ్‌ను క్రమంగా దెబ్బ తీస్తుందన్న విషయం ఆయన గుర్తిస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: