టీడీపీలో బీకాంలో ఫిజిక్స్ టార్గెట్‌గా ముసలం..!
బీకాంలో ఫిజిక్స్‌గా. ఫేమస్ అయిన.. మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుత టీడీపీ నాయకుడు.. మైనార్టీ నేత.. జలీల్ ఖాన్ మళ్లీ పుంజుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్.. వైసీపీ..ల తరఫున విజయం దక్కించుకున్న ఆయన మైనార్టీ వర్గంలో గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన కు ముందుగానే వైసీపీలో చేరిన ఆయన.. 2014లో వైసీపీ తరఫున గెలిచారు. తర్వాత.. మంత్రి పదవిపై ఆశతో.. చంద్రబా బు గూటికి చేరిపోయారు. అయితే.. ఆయన నోటి దూల కారణంగా.. బీకాంలో ఫిజిక్స్ చదవానంటూ.. చెప్ప డంతో ..చంద్రబాబు ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.
గత ఎన్నికలకుముందు.. అనారోగ్యం పాలవడంతో. ఆయన తన కుమార్తెను రంగంలోకి దింపారు. అయి తే.. వైసీపీ సునామీలో టీడీపీ ఓడిపోయింది. ఇక, అప్పటి నుంచి ఎక్కడా కనిపించని జలీల్ ఖాన్.. మళ్లీ వారం రోజులుగా పుంజుకున్నారు. మళ్లీ మీడియా ముందుకు వస్తున్నారు. స్థానిక మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిని బట్టి.. తాను మళ్లీ పుంజుకున్నానని. వచ్చే ఎన్నికల్లో తానే రంగంలోకి దిగుతానని.. ఆయన పరోక్షంగా సంకేతాలు పంపేస్తున్నారు. అయితే.. ఇది టీడీపీలో ఉన్న నాయకులకు మింగుడు పడడం లేదు.
ఎలా అంటే.. పశ్చిమ నియోజకవర్గంలో.. జలీల్ ఖాన్ పని అయిపోయందని భావించిన.. ఎంపీ కేశినేని నాని.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి తన కుమార్తె శ్వేతను రంగంలోకి దింపేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. తనకు ఉన్న ఎంపీ నిధులతో ఇక్కడ కొండలపై ఉన్న ఉంటున్న ప్రజలకు నీటి కనెక్షన్లు.. చిన్న చిన్న రోడ్లను బాగు చేయడం.. వంటి పనులు ఇప్పటికేచేయించారు. అంటే.. ఇది తనకువచ్చే ఎన్నికల్లో పనికి వస్తుందని.. తన కుమార్తెకు విజయం దక్కుతుందని.. ఆయన భావిస్తున్నారు.
అయితే.. ఇక్కడ నుంచి కేశినేని శ్వేతకు టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అనే విషయాన్ని..చంద్రబాబు కానీ, పార్టీనాయకులు కానీ.. ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. అయినప్పటికీ.. జలీల్ పుంజుకునేది లేదనుకున్న ఎంపీ మాత్రం దూకుడుగానే రాజకీయాలు చేస్తున్నారు. మైనార్టీ వర్గాలకు త్వరలోనేరానున్న రంజాన్‌కు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు కానీ, ఇంతలోనే జలీల్ ఖాన్ యాక్టివ్ అవడంతో.. ఇప్పుడు.. ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. పార్టీలో మళ్లీ వివాదాలు వస్తాయా? లేక.. సర్దుకుపోతారా? అనేది చూడాలి.