మారని జగన్.. బడ్జెట్‌ చెప్పిన సత్యమిది!

అమరావతిపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతిని మార్చడానికి వీళ్లేదని.. రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హైకోర్టు తీర్పుపై జగన్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడం లేదు. ప్రస్తుతానికి సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన జగన్ సర్కారు చేయడం లేదు. అలాగని ఈ తీర్పను అమలు చేసే ఉద్దేశ్యమూ కనిపించడం లేదు.


ఈ విషయాన్ని బడ్జెట్ మరోసారి తేటతెల్లం చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయాలంటే... రాష్ట్రం భారీగా ఖర్చు చేయాలి.. రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలంటే వేల కోట్లు ఖర్చుచేయాలి.. కానీ అమరావతికి బడ్జెట్‌లో నిధులే జగన్ సర్కారు కేటాయించలేదు. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో ప్రత్యేకగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. బడ్డెట్‌ లెక్కల్లో అమరావతి కోసం రూ. 13, 29 కోట్లు కేటాయించినట్టుగా చూపారు. అయితే అందులో రూ.800 కోట్లు కేంద్రం నుంచి సాయం వస్తుందని తెలిపారు.


ఇక సీఆర్‌డీఏకి సాయం అంటూ రూ. 200 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం హడ్కో, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలు, అసలుకు కూడా ఇది సరిపోదు. వీటికి ఏటా 550 కోట్లు కావాల్సి ఉంది. బడ్జెట్‌లో మాత్రం రూ. 200 కోట్లే చూపారు. ఇవి కాకుండా రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి పేరుతో రూ. 121 కోట్లు ఇస్తామని చెప్పారు. అవి కూడా అమరావతి గ్రామాల్లోని ప్రతి నెలా కౌలు చెల్లించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలకు తప్పనిసరిగా ఏటా ఇవ్వాల్సినవే.


అంటే.. కొత్తగా రాజధాని అమరావతి కోసం జగన్ సర్కారు రూపాయి కూడా ఖర్చు చేయాలని భావించట్లేదన్నమాట. మరి హైకోర్టు చెప్పింది కదా.. దాని మాటేమిటి అంటారా.. కోర్టులు చెప్పినవన్నీ యాజ్‌ ఇట్ ఈజ్‌గా చేస్తారా ఏంటి.. మళ్లీ కోర్టు ధిక్కరణ కింద రైతులు హైకోర్టుకు వెళ్తారు.. అప్పుడు నోటీసులు అందితే అప్పటికి ఏదో ఒక వాదన వినిపిస్తారు. మూడు రాజధానులే మా విధానం అని స్పష్టంగా చెప్పిన జగన్ సర్కారు.. అమరావతిని అభివృద్ధి చేస్తుందని ఆశించడం వల్ల ఫలితం ఏమీ ఉండదని మరోసారి తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: