ట్రిపుల్‌ ఆర్‌ ట్రైలర్‌.. భయపడిపోతున్న కేసీఆర్‌..?

ట్రిపుల్‌ ఆర్‌.. ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తున్న సినిమా ఇది.. ఇందులో ట్రిపుల్ ఆర్ అంటే అనేక అర్థాలున్నాయి. రణం, రౌద్రం, రుధిరం అనేది తెలుగు పేరు.. రామారావు, రాజమౌళి, రాంచరణ్‌ కలిసిన నటిస్తున్న సినిమా కాబట్టి ట్రిపుల్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ వచ్చింది. మరి ఈ ట్రిపుల్‌ ఆర్ ట్రైలర్‌కూ కేసీఆర్‌కూ సంబంధం ఏంటి.. ఈ ట్రైలర్‌కు కేసీఆర్ ఎందుకు భయపడతారు.. అనుకుంటున్నారా.. ఆ ట్రిపుల్ ఆర్‌.. ఈ సినిమా ట్రిపుల్ ఆర్ కాదు.. ఇది పొలిటికల్ ట్రిపుల్ ఆర్ అన్నమాట.

ఇక్కడ ట్రిపుల్ ఆర్ అంటే.. రాజాసింగ్, రఘునందన్‌ రావు, రాజేందర్‌ అన్నమాట.. వీళ్లు ముగ్గురూ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు.. బడ్జెట్ సమావేశాల తొలిరోజే వీరి ముగ్గురినీ సభ నుంచి సస్పెండ్ చేశారు.. స్పీకర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్నది వీరిపై ఉన్న అభియోగం.. అందువల్ల ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను ఈ సెషన్స్ వరకూ స్పీకర్ సస్పెండ్ చేసారు. అయితే ఈ పరిణామంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఇక బండి సంజయ్ అయితే.. ఏకంగా కేసీఆర్ భయపడిపోయారని విమర్శిస్తున్నారు. తెలంగాణ రాజ్యంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందంటున్న బండి సంజయ్.. త్రిపుల్ ఆర్ సినిమా ట్రైలర్ కే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. సభ ఎన్ని రోజులు జరుగుతుందో తెలియక ముందే బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. కనీసం సభను నడిపించేందుకు సభ్యులను కూర్చోమని అడగడం కూడా స్పీకర్ చేయలేదని బండి సంజయ్ అంటున్నారు.

బీజేపీ సభ్యులు ప్రశ్నిస్తారని మంత్రి తలసాని ముందస్తుగా రాసుకుని వచ్చిన స్క్రిప్ట్ మేరకే సస్పెండ్ చేశారని బండి సంజయ్ అంటున్నారు. పోలీసులకు శాసన సభలో రావడానికి ఏం సంబంధమని ప్రశ్నించిన బండి సంజయ్.. కార్యకర్తలు వస్తారన్న భయంతోనే ఎమ్మెల్యేలను వదిలేశారన్నారు. మా బట్టలు ఊడదిస్తరు అన్న ఉద్దేశంతోనే సస్పెండ్ చేశారని.. దీని కోసం అబద్దాల శాఖ మంత్రి అని కొత్త శాఖ పెట్టినట్టు ఉన్నారని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: