జగ్గన్నా.. కాస్త తగ్గన్నా.. మాణిక్యం సలహా..?

జగ్గారెడ్డి.. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండు రోజులుగా వార్తల్లో వ్యక్తి అయ్యారు.. అబ్బే నేను ఈ కాంగ్రెస్‌లో ఉండలేను బాబో.. నేను వెళ్లిపోతా.. అంటూ ఆయన గొడవ చేస్తున్నాడు.. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే.. నాపైనే ట్రోలింగులు చేయిస్తారు..నేను టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు మీమ్స్ చేయించి ప్రచారం చేయిస్తారా.. ఇదేందివయ్యా.. ఇంకా నేను ఏ ముఖం పెట్టుకుని ఈ కాంగ్రెస్‌లో ఉండను.. అంటూ.. ఆయన చిన్నబుచ్చుకున్నారు. అందుకే ఈ పార్టీ నుంచి వెళ్లిపోతున్నా అంటూ మీడియా మిత్రులకు కబురు పంపారు.

అసలే జగ్గారెడ్డి... కాస్త మీడియాలో ప్రముఖంగా కనిపించే నాయకుడు.. మరి ఇక ఇలాంటి మసాలా వార్త ఇస్తే మీడియా ఊరుకుంటుందా.. అందుకే రచ్చరచ్చే చేసేసింది. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు  చేసేసింది.. ఇక అప్పటి నుంచి పరామర్శలు ప్రారంభమయ్యాయి.. ఒకరి తర్వాత ఒకరు..అయ్యో జగ్గన్నా.. నువ్వు పార్టీ నుంచి వెళ్లిపోతే ఎట్లనే అంటూ ఓదార్పు యాత్రలు ప్రారంభమయ్యాయి. అయితే.. పాపం జగ్గారెడ్డికి నిజంగా పార్టీ మారాలన్న ఆలోచన లేనట్టుంది. అందుకే.. తన అసంతృప్తిని గట్టిగా వినిపించడమే లక్ష్యంగా ఉన్నట్టున్నారు..

ఇక వీహెచ్ తో పాటు అనేక మంది కాంగ్రెస్ సీనియర్లు జగ్గారెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత చివరకు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నివాసానికి పిలిపించుకుని మరీ సముదాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డి, సంపత్ కుమార్ ప్రత్యేకంగా జగ్గారెడ్డితో సమావేశమై ఆయనతో సంప్రదింపులు జరిపారు.. మొత్తానికి జగ్గారెడ్డిని బుజ్జగించారు ఉత్తమ్, గీతారెడ్డి, సంపత్ కుమార్.. జగ్గన్నా.. నువ్వేమీ దిగులు పడకు.. నిన్ను డిల్లీలో రాహుల్ గాంధీ తో కలిపించే పూచీ నాది అంటూ జగ్గారెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన హామీతో ఆయన కాస్త చల్లబడ్డారని చెప్పొచ్చు.  

ఈ వ్యవహారం అంతా సందడ్లో సడేమియాలా ముగిసిన తర్వాత.. రాష్ట్ర కాంగ్రెస్ మాణిక్యం ఠాగూర్ సోషల్ మీడియాలో పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎవరకూ మీడియా ముందు పార్టీ అంశాలను మాట్లాడొద్దు.. నేతలు ఎవరైనా అధిష్టానంతో చెప్పాల్సిన అంశాలను మీడియా ద్వారా మాట్లాడకూడదు అంటూ సూచించారు.. అంటే జగ్గన్నా..కాస్త తగ్గన్నా అని ..సలహా ఇచ్చినట్టే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: