జగన్ 'ఇగో'ను కేసీఆర్ వాడేసుకుంటున్నారా..?
అయితే.. ఇలాంటి జగన్ ఇగోను ఇప్పుడు కేసీఆర్ వాడుకుంటున్నారన్న వాదన కూడా వస్తోంది. ప్రత్యేకించి సినీ పరిశ్రమ విషయంలో కేసీఆర్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణకు మేలు జరిగేలా చూసుకుంటున్నారని చెప్పొచ్చు. వాస్తవానితి తెలుగు సినిమా పరిశ్రమలో ఆంధ్రా పెత్తనమే ఎక్కువ. ఎక్కువ అని కాదు.. అసలు సినీపరిశ్రమలో 90 శాతం ఆంధ్రా డామినేషనే ఉంటుంది. అలాంటిది తెలంగాణ విడిపోయాక కూడా హైదరాబాద్ నుంచి చిత్ర పరిశ్రమ తరలివెళ్లే ఆలోచన కూడా చేయలేదు.
ఇందుకు హైదరాబాద్‌లో ఉన్న సౌకర్యాలు, ఇప్పటికే స్థిరపడిన సినీ దిగ్గజాలు ఓ కారణమైతే.. సినిమా ఇండస్ట్రీ పట్ల స్నేహపూర్వకంగా ఉంటున్న ప్రభుత్వం కూడా మరోకారణం. సరిగ్గా ఇదే జగన్‌కు కంటగింపుగా మారిందన్న వాదన కూడా ఉంది. అసలు సినిమా పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదన్న అసహనం కూడా ఉండొచ్చు.
సరిగ్గా దీన్నే కేసీఆర్ ప్రభుత్వం కూడా వాడుకుంటోంది. ఓవైపు ఏపీలో టికెట్ల రేట్లు తగ్గిస్తూ.. బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ పరిశ్రమను ఇబ్బంది పెట్టేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటుంటే.. అదే తెలంగాణలో పరిశ్రమ అడిగిన అన్నింటికీ ఓ కే చెప్పేస్తూ.. హైదరాబాద్ సినిమా హబ్‌కు పది కాలాలు విరాజిల్లేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే జగన్ ఇగోను ఇలా కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నట్టేగా..? ఏమంటారు..?