మా పోరు : మంచిత‌నం..మంచుత‌నం

RATNA KISHORE
కూత నేర్చిందంతా కోయిలే అని అనుకోవ‌డం త‌ప్పు అని చెప్పాడు జాలాది. మోహ‌న్ బాబుకు ఇష్ట‌మ‌యిన క‌వి. అవును! ఇప్పు డు ఈ పాట మ‌ళ్లీ పాడుకోవాలి నేను. ఇప్పుడు కొత్త కూత‌లు కొన్ని రేప‌టి నుంచి వినిపిస్తాయి. ప్ర‌పంచాన్ని మేల్కొల్పే రాత మ‌రి యు కూత ఏద‌యినా మేలు చేస్తుంద‌న్న‌ది నా భావ‌న. నిర్ణ‌యాత్మ‌క శ‌క్తి ఒక ఆచ‌ర‌ణకు సంబంధించి ఉప‌యోగం అయితే అ లాంటి వేళ గొప్ప విజ‌యం ఒకటి సిద్ధిస్తుంది. మ‌రి! విష్ణు త‌న‌కున్న ప‌రిధిలో మంచి నిర్ణ‌యాల‌కు చిరునామా కావాల‌న్న‌దే మా సంక‌ల్పం కావాలి.. మా సంక‌ల్పం నెర‌వేర్చాలి కూడా!

విద్యా గ‌ర్వం, విజ‌య గ‌ర్వం అని రెండు ఉంటాయి. విద్యా సంస్థ‌లు న‌డుపుతున్న మంచు విష్ణుకు ఈ రెండూ తెలుసు అనే అను కుంటాను. పెద్ద‌వాడు అంద‌రి క‌న్నా కాస్త ఎక్కువ అహం ఉన్న‌వాడు అయిన మోహ‌న్ బాబు, మ‌రో అహంభావితో ఢీ కొన‌డ‌మే వి డ్డూరం. అయినా బలాబ‌లాలు తేలిపోయి, ఒక‌రి కొమ్ములు కాస్త విరిగి పోయాయి. ఇదే సంద‌ర్భాన ప్ర‌జా మ‌ద్ద‌తు ఉంద‌న్న భావ నలో మాత్రం మీరు త‌ప్పులు చేయొద్దు విష్ణు. మీరు మంచి ప‌నులు చేయాలి.. లేదంటే మ‌ళ్లీ మీకు అవ‌మానాలు త‌ప్ప‌వు.

యుద్ధం గెలిచాక వీరుడు అంటారు.. ఓడి పోయిన వాడిని ప‌రాజితుడు అంటారు. అదే యుద్ధంలో ఎవ‌రు ఎటు ఉన్నా పోరాటం ఆప‌ని వాడు సంక‌ల్పం సిద్ధి ఉన్న వాడు అవుతాడు. మా ఎన్నిక‌లు ఇన్ని గొప్ప మాట‌ల‌కు తార్కాణం కాదు. అకార‌ణ కోపాలకూ,
అకార‌ణ ద్వేషాల‌కూ కార‌ణం అయిన చోట ఓ గెలుపు వాటిని రద్దు చేస్తుంద‌ని అనుకోను. అదేవిధంగా పాత కోపాలు పాల  పొంగు కోపాలు అని కూడా అనుకోను. అనుకోని రీతిన ద‌క్కిన విజ‌యాలు ఏవ‌యినా ఉంటే ఆ కోవ‌లో ఈ విజ‌యం వ‌రించింద‌ని చెప్ప‌ను కానీ.. ఇన్ని ద్వేషాల‌కు ప్రేమ అనే ముసుగు రేప‌టి నుంచి ల‌భ్యం అవుతుంది. అదొక్క‌టే బాధ.. ఫిల్మ్ న‌గ‌రంలో మంచు కురుస్తోంద‌ట! విష్ణు గెలుపుతో! మంచి ల‌భ్యం అవుతుందో లేదో మాత్రం తెలియ‌దు. అవ‌న్నీ రేప‌టి వేళ త‌ప్ప‌క తేలుస్తుంది.

మా ఎన్నిక‌లు రామ రావ‌ణ యుద్ధం అని అన్నారు మోహ‌న్ బాబు. రాముడెవ్వ‌డు? రావ‌ణుడెవ్వ‌డు ? అని కూడా అనుకున్నాను నేను. రాముడు ప్ర‌కాశ్ రాజ్ అవుతాడా? లేదా రావ‌ణుడి మంచు విష్ణు అవుతాడా? గొప్ప పోలిక ఒక‌టి తెర‌పైకి తెచ్చి, త‌న మాట నెగ్గితే చాలు అన్న భావ‌న‌లో ఉన్నాడు మోహ‌న్ బాబు. ఎన్నిక‌లు అవుతున్న సంద‌ర్భంలో మీడియా ముందుకు వ‌చ్చి, నిర్వేదాన్ని వెళ్ల‌గ‌క్కి పోయాడు మోహ‌న్ బాబు. న‌వ్వేను నేను. ఏ యుద్ధం అయినా ఎలా మొద‌ల‌వుతుంది. ఎలా ముగుస్తుంది. ఇవి నిర్వేదాల నుంచి తేల్చుకోవాలి అని నిర్ణ‌యించుకోవాలి అని చ‌దివేను. అవును! ద‌స‌రా పండుగ కొన్ని నేర్పి పోతుంది. నిల‌క‌డ‌గా లేని మ‌నిషి, నిల‌క‌డ కోసం ప్ర‌య‌త్నించే మ‌నిషి. ఇవ‌న్నీ అహాల‌ను వ‌ద్దు అని చెప్పి పోతుంది. ప్రకాశ్ రాజ్ మంచి న‌టుడు నేను అంగీకారం తెలుపుతున్నాను. కానీ నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వ‌స్తారు అన్నాడు విష్ణు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఇరు వ‌ర్గాలూ బాగా తిట్టుకున్నాయి. రేయ్. రేయ్.. రారా చూసుకుందాం అని కూడా ప్ర‌కాశ్ రాజ్ అరిచాడు. ఇవ‌న్నీ అస‌హ్యంగా తోచాయి. ఇప్పుడు ఎవ‌రిది మంచి ఎవ‌రికి చెడు ఈ గెలుపు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: