మార్నింగ్ రాగా : స్వ‌ర గాంధార సంచారం.. ఒక జ్ఞాప‌కం

RATNA KISHORE
ఆమ‌ని వ‌చ్చిన వేళ‌ల‌ను, నిరాశ‌ల‌ను వీడిన వేళ‌ల‌ను మ‌నిషి నివాళి ఉప‌యోగించుకోవాలి. నివాళికి ఇవాళ అంగీకారార్థాన్ని వి స్తృతం చేస్తూ నేను. కొంచెం చ‌దువుకుంటే ఇలా రాస్తారు. కొంచెం చ‌దువు తెలిస్తే నా క‌న్నా ఇంకొంద‌రు బాగా రాస్తారు. వాక్యార్థం , వ‌చ‌నార్థం తెలిపే ప్ర‌య‌త్నాల్లో త‌ప్ప‌క ఉంటారు. వివ‌రణాత్మ‌క దృష్టి ఒక‌టి దృక్ప‌థాల‌ను బ‌ల‌ప‌రిచేందుకు ఉపయోగ‌ప‌డుతుంది అని విశ్వ‌సిస్తాను నేను. విశ్వాసిని నేను. తూరుపు ప్రాంత విశ్వాసిని నేను.


ప‌లికేది గాంధారం

ప‌లికేది పాంచభౌతికం

ఐదు రూపాలు క‌లిసి

ఒక రూపాన్ని ఇచ్చి పోయిన రోజు!

వినిపించిన పాంచ‌జన్యం విప్ల‌వ‌మో

అంగీకారార్థ‌మో తెలియ‌దు కానీ

వైదికం కూడా ఈ ఆధిక్య స్వ‌రాలను అంగీకరించింది

క‌నుక బాలూకు నివాళి! అంతః క‌లోలాల సంద‌ళ్ల‌లో!


నెత్తి మీద బోలెడు ఉన్నాయి అవి మోయ‌డంలోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి అని బాగా చ‌దువుకున్న నా స్నేహితుడు ఒక రు చెప్పారు న‌వ్వేను. హృద‌య గ‌త విష‌యాల్లో ఇలాంటి చెల్లుబాటు అవుతాయా అని కూడా అనుకున్నాను. న‌ల్ల‌ని దేహం , న‌ల్లని రాయి ఏదో ఒక త‌త్వ సారాల‌ను అందించి పోయింది. వారి వైదికమో వారి సామాజిక‌మో ఏదో ఒక‌టి కొన్ని నినాదాలు విది ల్చి పోయింది. కొత్త కుర్రాళ్ల‌కు పాట రాయ‌డం మాత్ర‌మే తెలుసు. కానీ వివ‌ర‌ణాత్మ‌క రీతిలో పాట గురించి చెప్ప‌లేరు అని ఓ అభి యోగం. అవును! రాయ‌డం తెలిసిన వాడికి విశ్లేష‌కుడు వేరుగా ఉండాలి. ఆ ప‌ని బాలు చేశారు కొంత కాలం. కొన్ని సార్లు గెలిచి నిలిచిన క్ష‌ణాల ద‌గ్గ‌ర మ‌నం అంతా చిన్న‌బోతాం. బాలు గెలిచి నిలిచి సాహిత్యంలో త‌ప్పొప్పులు త‌న‌కు తెలిసినంత చెప్పారు. మంచి పాట‌కు స్వ‌రాభిషేకం చేశారు. మంచి పాట వ‌స్తుందా స‌ర్ అని అడ‌గాల‌ని అనుకున్నాను. వ‌స్తుంది కానీ అందులో ఉన్న మంచి ఎంత‌న్న‌ది నాకు తెలియ‌దు అని న‌న్ను నేను హాయిగా స‌మాధాన ప‌రుచుకున్నాను. ఇవాళ చెన్న‌య్ వీధులు ఆయ‌న ను స్మ‌రించుకుంటాయి. తెలుగు క‌న్నా ఆయ‌న త‌మిళంకు ఇంకా ఎక్కువ సేవ చేశారు అని ఓ ప్రాంతంలో విన్నాను. మంచి పాట భాష‌ల‌కు అతీతం అని చెప్ప‌డంలో ఔన్న‌త్యం ఉంది. అంగీకార్థం కూడా ఉంది. ప్రాంతాల అవ‌ధులు చెరిపేయాల‌న్న స్పృహ‌లో ఉ న్నప్పుడు మ‌ళ్లీ నిన్న మిట్ట ప‌ల్లి సురేంద‌ర్ (ల‌వ్ స్టోరీ సినిమాకు పాట రాశారు ఆయ‌న‌) పాట విన్నాను. ఆనందించేను. శేఖ‌ర్ ఓ సంద‌ర్భంలో వేటూరినీ,బాలూనీ క‌లిపారు. గోదావ‌రి పాట‌కు ఓ అర్థం ఇచ్చి, ఆరుద్ర‌ను దాటిపోయేలా చేశారు. క‌నుక ఇక్క‌డ పాట కు అంగీకారార్థం ఉంది. ఏం త‌గ్గింది మా రామ‌య్య భోగం ఇక్క‌డ అని రాశారు.. వేటూరి..అదే మాట ఈ కుర్రాడికీ అప్ప‌గించండి. కు ర్రాడి పేరు ఎస్పీ బాలు. డు కూడా చేర్చాలి. అది ఆయ‌న విన్న‌పం బాలుడు.

విజ‌య‌న‌గ‌రం కుర్రాడి పాట విన్నాడు. డు లేదా రు. రు రూలింగ్ అయి ఉంటుంది. స్వ‌రం రాసేట‌ప్పుడు త‌ప్ప‌క రూలింగ్ ఉంటుం ది. కానీ జీవితాశ‌యాల పందిళ్ల‌లో రూలింగ్ ను పాటించను. ఇలాంటి పాట పాడేట‌ప్పుడు నీవు ఏం చేయాలి కొన్ని చోట్ల ఊపిరి కో సం వెసులు బాటు తీసుకోవాలని చెప్పారు ఓ సంద‌ర్భంలో! పాట పాడేట‌ప్పుడు ప‌దం ప‌లికేట‌ప్పుడు ఒక ఉచ్ఛ్వాస సంబంధ బ డలిక‌ను కూడా ప్రేమించాలి. అనంతంలో క‌లిసిపోయిన దేహాలు బ‌డలిక వీడి ఉంటాయా అని అంటే లౌకికం అర్థం వేరు.అవి తీసు కుని చెబితే ఆ ప్రామాణిక రీతి గురించి నేనేం మాట్లాడ‌ను. చెప్పాను క‌దా! ఓ సుస్ప‌ష్ట ధార‌ల చెంత స్వ‌రాలు కొన్ని అనునయంతో కూడి ఉన్నాయి. జీవితం ఆద‌ర్శం అని ఓ వాక్యం రాయ‌డంలో త‌ప్పులే ఉన్నాయి. అలాంటి త‌ప్పులు చేయ‌ను. కానీ బాలు చేసిన మేలు మాత్రం ఈ సంగీత ద‌ర్శ‌కులు గుర్తు పెట్టుకుని నివాళి ఇవ్వ‌డంలో సిస‌లు ఆద‌ర్శం ఒక‌టి దాగి ఉంది.

మ‌రీ! మూసి ఉన్న చోటు. నిద్రాణం అని రాయాలి. క‌ల‌లకు ఏమ‌యినా లిపి ఉందా అని అడిగేను. బాలు లాంటి స్వ‌ర‌లిపి తోడు ఉండి ఉంది అని రాయాలి. పాట‌ల్లో బాలు చేసిన ప్ర‌యోగాలు మ‌న‌కు ఒక చిరంజీవిని మ‌రో స్థాయిని అందించాయి. చిరంజీవి అని రాయ‌డం క‌న్నా స్వ‌రంజీవి అని రాయాలి అనుకుంటాను. ఏమో! ఈ ప్ర‌యోగార్థాల‌కు నాకూ మ‌ధ్య విముఖ‌త ఉంది.ప్ర‌యోగానికి విముఖ‌త ఎందుకంటే అది అన్ని వేళ‌లా అర్థానికి తూగాలి. భౌగోళికార్థం క‌న్నా సామాజిక స్పృహ ఒక‌టి స్ప‌ష్టంగా క‌నిపిస్తే చాలు. ఈ నిగ‌మాగ‌మ సంచారిలో కొన్ని గ‌మ‌నించాను. పాట‌ను ఎలా ప‌ల‌కాలి అని చెప్ప‌డంలో ఇంత‌వ‌ర‌కూ మ‌రో పోలిక లేని గాయ‌కుడు.


పిలిచిన ముర‌ళికి 

వలచిన మువ్వకి

ఎద‌లో ఒక‌టే రాగం అని రాశాడు వేటూరి

అది ఆనంద భైర‌వి రాగం అని కూడా చెప్పాడు


చుక్క‌లు క‌లిపి దిక్కులు తేల్చ‌మ‌న్నాడు ఒక‌డు. న‌వ్వేను. విన‌మ్రపూర్వ‌క విష‌యాల‌ను నీవు రాయాలి అని చెప్పారు. అవున వును! అవే రాస్తున్నాను.మ‌నిషి శ్వాస‌కు సంబంధించి, గాలిలో విన‌మ్ర‌త ఉందా.? ఈ గాలి మోసుకు వ‌చ్చే గంద‌రగోళాలే మ‌న జీవితాల‌ను శాసిస్తున్నాయా? పిల్ల‌లంతా రెక్క‌లు తెచ్చుకుని పాడాల‌ని ఉంది అన్న‌ప్పుడు ఆయ‌న కొన్ని సూచ‌న‌లు చెప్పి, సాహిత్యం మ‌ప్పి పంపారు. తెలుగు సాహిత్యం బాగా తెలిసిన గాయ‌కుడు బాలు అని చెప్ప‌డంలో ఎంత చిన్న మాట దాగి ఉంది. అల‌సట కూడా నాలో ఉంది. ఇలాంటి మాట‌లు కొన్ని క‌లిపి చెప్పి చెప్పి పొందిన అల‌స‌ట. ప్రేమొక్క‌టే జ్ఞాప‌కం అవుతుంది. చుట్టూ ఉన్న గాలి గంధాల‌నూ అది ప‌ల‌క‌రింప‌జేస్తుంది అని రాశారొక క‌వి, ఆనందించేను నేను,..ఆనందించాలి మీరు.


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


డిజిట‌ల్ పోస్ట‌ర్ రూప‌క‌ర్త : గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లి, విజ‌య‌వాడ క్షేత్రం





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: