మీడియా ను తిట్ట‌కు ? : ప‌ర‌మ ప‌విత్ర ధ‌ర్మం ఒక‌టి ఉందా లేదా?

RATNA KISHORE




రైట‌ర్సు పెన్ను హానెస్టు ఒన్ను


అవునా కాదా?



మీడియాలో ఎన్ని త‌ప్పులున్నాయో

బ‌య‌ట ప్ర‌పంచంలోనూ అన్నే ఉన్నాయి



అంత‌కుమించి ఉన్నాయి



ప్ర‌పంచానికి శుద్ధ‌జ‌లం అవ‌సరం కానీ



మురికి నీరు కూడా అవ‌స‌రం







మురికిని ఎవ‌రికి వారు వ‌దిలించుకోవాలి. ఆ విధంగా మీడియాలు బ్యాన్ చేయండి త‌ప్పేం లేదు. ఆ ప‌ని చేస్తే సంతోషిస్తాను. మ‌న జీవితాల‌ను ప్ర‌భావితం చేయ‌నివి ఏ మ‌యినా వ‌ద్ద‌నుకోవ‌డంలో త‌ప్పే లేదు. త‌ప్పంతా మ‌న అంగీకారంలో ఉంది. అంగీకా రంలో ఉన్న‌వాటిలో మంచినీ, చెడునీ వేరు చేసి చూడ‌డం మ‌నం నేర్చుకోవ‌డం లేదు. ఇందుకు మీడియానే త‌ప్పు అని అంటున్నాం లేదా సినిమాదే త‌ప్పు అంటున్నాం. ఎంపిక అన్న‌ది ఎవ‌రికి వారు తీసుకుని తీరాల్సిన నిర్ణ‌యం. అమిత‌మ‌యిన జ్ఞానం ద‌రిద్రగొట్టు మీడియా ఇవ్వ‌న‌ప్పుడు వ‌ద్దునుకోవ‌డం త‌ప్పే కాదు. అది స‌బ‌బు కూ డా! మీడియా అనే కాదు సినిమా కూడా అలానే ఉంది. క‌నుక హ‌రీశ్ శంక‌ర్, దొంతు ర‌మేశ్ ఒక‌రిని ఒక‌రు తిట్టుకోవ‌డంలో అర్థం లేదు. సినిమాలోనూ వికృతం ఉంది మీ డియాలోనూ అదే వికృ త సంబంధ పోక‌డ‌లూ ఉన్నాయి.



వినోదానికి సినిమా అని వ‌దిలేయండి..అంటే ఎవ్వ‌రూ ఒప్పుకోరు..విజ్ఞానానికి సిని మా అంటే ఒక‌నాడు ఒప్పుకున్నారు. ఇప్పుడూ ఒప్పుకుంటారు. కానీ ప్ర‌జ‌ల‌లో.. ఆ..అంగీకారం ఉందా? ఫ‌క్తు మ‌సాలా సినిమాలు వ‌ద్ద‌ని జ‌నం బాహాటంగా చెప్ప‌గ‌లిగి వెనక్కు పంప‌గ‌లిగిన రోజు, హింస, అశ్లీలం వ‌ద్దే వ‌ద్దు అని నిన‌దించి రోడ్డెక్కిన రోజు ఇ వ‌న్నీ సాధ్య‌మే. సినిమా లేదా మీడియా ఒక‌ప్ప టి రోజుల్లో బాగుంద‌ని అంటారు. అ వును! గ‌త కాలం బా గుంద‌ని అనుకోవ‌డంలో త‌ప్పు లేదు. కానీ కాలాన్ని అక్క‌డే ఉంచి మనం ప‌రుగులు తీయ‌డం మానుకోలేదు క‌దా! క‌నుక వికృతాన్ని విస్తృతం చేయ‌డం సినిమా కానీ మీడియా కానీ మానుకోవాలి అని నాలాంటి వారు వి న్న‌విం చ‌డం త‌ప్ప ఏం చేయ‌లేం.




మ‌నిషి ఎన్నో సంద‌ర్భాల్లో నిస్స‌హాయంగా ఉండిపోతాడు. ఎవ్వ‌రినీ ప్ర‌శ్నించ‌లేడు. ఎవ్వ‌రితోనూ త‌గాదాలు పెట్టుకోలేడు. అలాంటి చోటు న్యాయం ద‌క్కాల‌ని, దుఃఖం తీరాల‌ను దాటాల‌ని మ‌నం అనుకోవ‌డం అవివేకం. ద‌రి ద్ర‌గొట్టు మీడియా, ద‌రిద్ర‌గొట్టు సినిమా ఇలానే ఉంద‌ని ఎన్నో సార్లు చెప్పాను. వింటారా.. అస‌లు మీడియాను బ్యాన్ చేసేంత శ‌క్తి ప్ర‌జ‌ల‌కు ఉంటే బాగుంటుంది. ఆ శ‌క్తి రావాలి అని కూడా కోరుకుంటాను. న‌న్ను చాలా మంది అడుగుతారు..తోటి జ‌ర్న‌లిస్టులు అని కూడా చూడ‌కుండా తిడ‌ తావేం అని! అవును! ఆ విధంగా తిట్ట‌డంలో నా బాధ్య‌త ఉంది. నేనొక బాధితుడ్ని క‌ నుక ఆ విధంగా స్పందిస్తాను. ప్ర‌ధాన స్ర‌వంతిలో ప‌నిచేసే వారికి నా పాటి రాయ‌డం కూడా రావ‌డం లేదు క‌నుక తిడ‌తాను. బ‌చ్చా మీడియా అని ఎందుకు అంటాను ఊ ర‌క‌నే ఎందుకు అంటాను..టీడీపీ హ‌యాంలో భూములు కొట్టేసిన జ‌ర్న‌లిస్టులు, వైసీ పీ హ‌యాంలో భూములు కొట్టేయాల‌న్న ఆలోచనతో ఉన్న జర్నలిస్టులు, ప‌ర‌మ ద‌ రిద్రంగా వార్త‌లు రాసి ఊళ్లో హీరోలుగా, దేశంలో హీరోలుగా చెలామ‌ణీ అవుతున్న జ‌ ర్న‌లిస్టులు వీళ్లంతా క‌ళ్లెదుటే ఎదిగిపోతుంటే నిజంగానే,నిజంగానే ఓర్వ‌లేక‌నో, అస‌ హ్యం పుట్టో తిడ‌తాను.




ఈ విధంగా తిట్ట‌డంలో ఆనందం ఉంది. ఒక నాయ‌కుడు మంచి చేస్తే నేనే స‌మ‌ర్థిస్తా ను. ఒక సినిమా హీరో మంచి చేయాల‌ని ప‌రి త‌పిస్తే నేనే సంతోషించి నాలుగు మంచి మాట‌లు రాస్తాను. అలాంట‌ప్పుడు ద‌రిద్రం అంతా నెత్తిన కుమ్మ‌రించే మీడియాలను చూసి ఈస‌డించుకోక మ‌ద్ద‌తు ఎందుకు ఇవ్వాలి. నాకు తెలిసినంత వ‌ర‌కూ, తెలిసిన విధంగా ఒక వార్త ఇత‌రులను కించ‌ప‌రిచిందా లేదా అన్న‌ది చెప్ప‌గ‌ల‌ను.




ఆ భావం ఆ ఉద్దేశం ఏంట‌న్న‌వి చెప్ప‌గ‌ల‌ను..ఇన్ని చెప్ప‌గ‌ల‌ను క‌నుక ఏం రాస్తు న్నారు మీరు? ద‌రిద్రం..అంతా అలా వార్త‌ల్లో చొప్పిస్తారేంటి అని తిడ‌తాను. ప్ర‌తి మీ డియాకూ బాధ్య‌త ఉండాలి. ప్ర‌తి సినిమాకూ బాధ్య‌త ఉం డాలి. ఉండాలి అని చెప్ప‌ డంలో అర్థం ఉంది. లేని సంద‌ర్భాల్లో త‌ప్ప‌క కోపం అన్న‌ది ఒక‌టి వెల్ల‌డిలో ఉంటుం ది. త‌ప్పేం లేదు టీవీ 9 అమ‌ర్ ర‌హే అని చెప్ప‌డం విని ఆనందించాను..నాకు ఇలాంటి నినాదాలు న‌చ్చుతాయి.. తోటి జ‌ర్న‌లిస్టులు అని చూడ‌కుండా నీవు ఆనందిస్తావా అని అంటే త‌ప్ప‌క ఆనందిస్తాను..



ఎందుకంటే ఆ బ‌చ్చా మీడియాల‌కు ఉన్న సామాజిక బాధ్య‌త ఎంత‌న్న‌ది నాకు స్ప‌ష్టంగా తెలుసు క‌నుక! క‌నుక రాజ‌కీయం, సినిమా, మీడియా ఈ ట్ర‌యోలో ఉన్నంత మంచి,ఉన్నంత చెడు ఎప్పుడూ వెలుగులోకి వ‌స్తూనే ఉండాలి. అప్పుడ‌ప్పుడూ అ యినా ఓయూ జేఏసీ కుర్రాళ్లు రోడ్ల‌మీద‌కు వ‌చ్చి ఇలానే మీడియాను తిడుతూ ఉం డాలి.. ఆనందించాను నేను.. ఆనందించాలి మీరు.. మీడియా అమ‌ర్ రహే అన‌డంలో త‌ప్పు లేదు..అది వారి వాక్కు అది వారి స్వాతంత్ర్యం..గౌర‌వించాను నేను.. గౌర‌విం చాలి మీరు..థాంక్ యూ ఓయూ జేఏసీ.. థాంక్ యూ హ‌రీశ్.. థాంక్ యూ దొంతు ర‌మేశ్..మ‌రి! ప‌ర‌మ ప‌విత్ర ధ‌ర్మం ఒక‌టి ఉందా? లేదా?



- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి:

tg

సంబంధిత వార్తలు: