వైఎస్‌ స్మృతిలో: నీ పథకాల్లో బతికే ఉన్నావు..!

ఇవాళ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి.. ఆయన హఠ్మారణం చెంది 12ఏళ్లు గడిచాయి. వైఎస్‌ ఏపీని దాదాపు ఆరేళ్లు పాలించారు. అసలు ఓ రాష్ట్రం సుదీర్ఘ ప్రయాణంలో ఆరేళ్లు పెద్ద విషయమేమీ కాదు.. అంతకంటే చాలా మంది ఎక్కువ కాలం పాలించారు. కానీ.. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నాయకుడు వైఎస్సార్‌ మాత్రమే అని చెప్పొచ్చు. మరి కేవలం ఆరేళ్లలోనే అంతటి ప్రజాదరణ వైఎస్‌ ఎలా సొంతం చేసుకున్నారు..? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన ప్రవేశపెట్టిన పథకాలే..!

అవును.. వైఎస్‌ పూర్తిగా పేదల పక్షపాతిగా పాలించారు. ప్రతి పేదవాడికీ కార్పొరేట్ తరహా వైద్యం.. అసలు ఇలాంటి ఆలోచనే గతంలో ఏ నేత కూడా చేయలేదు. ఎంతసేపూ సర్కారీ వైద్యం అంటే.. శిథిల ప్రభుత్వాసుపత్రుల్లో మగ్గడం తప్ప మరో ఆలోచనే లేదు. అలాంటిది పేదోడు కూడా దర్జాగా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేలా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తెచ్చాడు. ఈ పథకం తెచ్చిన మొదట్లో కార్పొరేట్ ఆస్పత్రులను మేపేందుకే ఈ పథకం తెచ్చాడన్న పార్టీలో తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా దాన్ని కొనసాగించారు.

ఆ తర్వాత వైఎస్‌కు అంతగా పేరు తెచ్చిన మరో గొప్ప పథకం.. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌.. పేదోడి పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలన్నది వైఎస్‌ కల. అందుకే ప్రైవేటు కళాశాలల్లో చదివిన పేదోడి ఫీజులు ప్రభుత్వమే చెల్లించేలా ఈ పథకం తెచ్చారు. ఈ పథకం పుణ్యమా అని ఎందరో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారు. తమ జీవితాలను మార్చుకున్నారు. ఇక అన్నింటి కన్నా గేమ్‌ ఛేంజర్‌ ఉచిత విద్యుత్‌ పథకం.. ఈ పథకం ప్రకటించగానే.. ఇలా ఉచిత విద్యుత్‌ ఇస్తే.. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎగతాళి చేసిన పార్టీలో ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చాక కూడా ఈ పథకాన్ని కొనసాగించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో పథకాలు.. అన్నింటిలోనూ ప్రధాన లక్ష్యం పేదోడు బాగుపడటమే. అందుకే వైఎస్సార్‌ భౌతికంగా లేకపోయినా.. ఆయన్ను స్మరించుకునేవారికి కొదవు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: