ఓవ‌ర్ టు ఈనాడు : ఆ గీత‌లు ఇక క‌న‌ప‌డ‌వు !

RATNA KISHORE
సుదీర్ఘ అనుబంధం 
నాలుగు ప‌దుల వ‌సంతాల అనుబంధం 
రామోజీ రావు మానస పుత్రుడిగా పేరు 
కార్టూన్ ఎడిట‌ర్ అన్న వ‌ర్డ్ నే క్రియేట్ 
చేయించుకున్న ధీశాలి ప్ర‌తిభా సంప‌న్నుడు 
అయిన శ్రీ‌ధ‌ర్ (వ్యంగ్య చిత్ర కారుడు) ఈనాడుకు 
రాజీనామా చేశారు.... 





మొద‌టి పేజీ లో కార్న‌ర్ లో క‌నిపించే కార్టూన్ తెలుగు వారి లోగిళ్ల‌కు ఎన్నో ఏళ్లుగా ప‌రిచ‌యం. నాలుగు ద‌శాబ్దాల ప్ర‌యాణంలో శ్రీ‌ధ‌ర్ ఎన్నో వ్యంగ్య చిత్రాల‌తో పాఠ‌కుల‌ ను అల‌రించారు. ఆలోచింప‌జేశారు. మ‌ధ్య‌లో కొన్ని ఆరోగ్య కార‌ణాల రీత్యా త‌న ఉద్యో గ జీవితానికి విరామం ఇచ్చినా ఏనాడూ ఈనాడును వ‌దులుకోలేదు. అస‌లు వ‌దు లుకోవాల‌న్న ఆలోచ‌న‌ల‌లో కూడా ఆయ‌న లేరు.




ఒక కార్టూనిస్టు లైఫ్ ఇంతటి కెరియ‌ర్ స్పాన్ ను చూడ‌డం, రాజ‌కీయ వ్యాఖ్యానాల‌తో త‌న‌దైన ఎత్తిపొడుపు రేఖ‌ల‌తో తెలుగు ప‌త్రి కా రంగానికే ఓ ప్ర‌త్యేక రీతిని ఆపాదించ‌ డం అన్న‌వి శ్రీ‌ధ‌ర్ తోనే సాధ్యం. క‌మ్యూనిస్టు భావ‌జాలం ఉన్న ఆయ‌న ఆ భావ‌న‌లో ఎ న్నో గొప్ప కార్టూన్ల‌కు రూపు ఇచ్చారు. రాజ‌కీయ కార్టూన్ల‌కు కొత్త వ‌న్నెలు దిద్దా రు. కార్టూనిస్టు ఆర్కే లక్ష్మ‌ణ్ అంత‌టి పేరును తె లుగు ప‌త్రికా రంగంలో నుంచే అం దుకున్నారు. ఓ విధంగా ఈనాడు జీవితాన్ని తీర్చిదిద్దారు అని రాయ‌డం స‌బ‌బు. ఆ య‌న కా ర్టూన్లంటే వేల మందికి ఇష్టం. ల‌క్ష‌ల మందికి ప్రాణం.. కొన్ని రేఖ‌లను అను స‌రించ‌డం క‌ష్టం. అలానే కొంద‌రి చిత్ర‌కారుల‌ను మ‌ళ్లీ త‌యారు చేయ‌డం కూడా క‌ ష్టం. కార‌ణాలు ఏమ‌యినా ఈనాడు కాంపౌండ్ నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం ఓ సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం. 



ఎన్టీఆర్ను పేదవాడి గుండెల్లో నిలిపినా., మోడీపై సెటైర్లు వేసినా, మ‌రో నాయ‌కుడిపై పేర‌డీ పాట‌లు పాడినా, మాయావ‌తిని ఏనుగెక్కి ఊరేగించినా ఏమి చేసినా ఏం చేయ‌ కున్నా అవ‌న్నీ శ్రీ‌ధ‌ర్ న‌వ్వుల్లో భాగం అయిపోయాయి. ముఖ్యంగా శ్రీ‌ధ‌ర్ నిరంత‌రా భ్యాసి..మంచి వ్య‌క్తిత్వం ఆయ‌న సొంతం. విమ‌ర్శ‌కు ప్రాధాన్యం ఇచ్చే మ‌నిషి. ఏం చె ప్పినా వినే మ‌నిషి. సుదీర్ఘ కాలం ఆ కాంపౌండ్ లో అతి త‌క్కువ జీతం నుంచి ఎదిగి వ‌చ్చినా ఎన్న‌డూ ఎవ్వ‌రినీ బాధించినా లేదా నొప్పించిన సంద‌ర్భాలే లేవు. తెలంగా ణ లో మారు మూల ప్రాంతం నుంచి ఆ మూలాల నుంచి ఆయ‌న చేసిన ప్ర‌యాణం.. హైద్రాబాద్ లో ప‌డిన క‌ష్టాలు అన్నీ అన్నీ ఈరోజు ఆయ న్ను ఇంత‌టి వాణ్ని చేశాయి అని చెప్ప‌డం ఓ విధంగా ఎంతో ఆనందదాయ‌కం. ఇంత‌టి శిఖ‌ర స్థాయి కీర్తి తెలుగు కార్టూనిస్టుల‌లో కొద్ది మందికే ద‌క్కింది. బాపూ కూడా ఆయ‌నను ఎంతో మెచ్చుకు న్న సంద‌ర్భాలున్నాయి. అయినా స‌రే ఈ రోజుకూ ప్రీ నోట్సు ముందుగా ప్రిపేర్ చేసు కోనిదే ఆయ‌న బొమ్మ‌లు వేయారు. ప్ర‌తిరోజూ ఈ త‌ర‌హా సాధ‌న త‌న‌కు మాత్ర‌మే సా ధ్య‌మ‌ని చాటిన వ్య‌క్తి. ప్ర‌జా సాహిత్యం., ప‌ద్య సాహిత్యం బాగా తెలిసిన వ్య‌క్తి. తెలుగు వారికి కార్టూన్ ఇష్టుడు.. మ‌న లోగిళ్ల‌లో ఆయ‌న మానస పుత్రుడు బాలు రోజూ ఆడు కుంటాడు. మ‌న‌తో క‌బుర్లు చెబుతాడు. మంచి గీత - మంచి రాత ఈ రెండూ శ్రీ‌ధ‌ర్ కు ఆభ‌ర‌ణాలు.. ఇంకా చెప్పాలంటే ఆయ‌న స్థాయిని పెంచిన‌వే ఇవి. ఎందుక‌నో ఆయ‌న ఇవాళ ఈనాడు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. తెలుగు గీత మ‌రో రూపు తీసుకుం టుంద‌ని ఆశిద్దాం. తెలుగు రాత మ‌రో శిఖ‌రాన్ని చేరుకుంటుంద‌ని భావిద్దాం.
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: