కొవిడ్ రూల్స్... వాళ్లకు మాత్రమే వర్తిస్తాయా..?

కొవిడ్ రూల్స్... ఇంకా చెప్పాలంటే... అధికారిక భాషలో ప్రోటోకాల్... కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గతేడాది మార్చి నెల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్న నిబంధనలు ఇవే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్ వాడాలి. ఎక్కడా కూడా ఐదుగురికి మించి గుమ్మి కూడకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు. ఇక నిరనస ప్రదర్శనలు, ఆందోళనలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. ఇలాంటివి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవి ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడంతో పాటు... కేసులు కూడా నమోదు చేసే అధికారం పోలీసులకు ఉంది. అయితే ప్రస్తుతం పోలీసు శాఖ తీరు విమర్శలకు దారీ తీస్తోంది. రూల్ ఈజ్ రూల్... రూల్ ఫర్ ఆల్ అనేది ప్రభుత్వం మాట. కానీ ఇది కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తుంది అనేలా పోలీసు శాఖ వ్యవహరిస్తోంది.
ఓ వైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గడంతో... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అటు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. నేతల ర్యాలీలు, వివాహన వేడుకలు కూడా అట్టహాసంగానే సాగుతున్నాయి. అయితే... ఈ తతంగం అంతా కూడా కేవలం అధికార పార్టీ నేతలకే సరిపోతుంది. అంతే కాని ప్రతిపక్షాలకు చెందిన నేతలు ఎవరైనా నిరసన చేయాలని ప్రయత్నిస్తే మాత్రం కొవిడ్ నిబంధనలు అడ్డు వస్తాయి. అసలు నలుగురు కలిసి ఓ కారులో ప్రయాణించడమే నేరం అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఇదే పక్షపాతం చూపిస్తున్నారు పోలీసులు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నప్పటికీ... టీడీపీ నిర్వహించనున్న నిరసన ప్రదర్శనలకు మాత్రం అనుమతులు లేవంటున్నారు పోలీసులు. అదేమని ప్రశ్నిస్తే మాత్రం... కొవిడ్ ప్రోటోకాల్ అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. వైరస్ వ్యాప్తి చెందుతుందని... కాబట్టి ఎలాంటి ప్రదర్శనకు వీలు కాదంటున్నారు. ఇదే ఇప్పుడు పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు దారి తీస్తోంది. కొవిడ్ నిబంధనలు మాకు మాత్రమే వర్తిస్తాయా అని నిలదీస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఓ వైపు వైసీపీ నేతలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నప్పటీ... వారికి ఎలాంటి రూల్స్ పెట్టని పోలీసులు... కేవలం టీడీపీ నేతలపై మాత్రమే తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: