కాంగ్రెస్‌ కనబడుటలేదు.. కేసీఆర్‌ కొత్త వ్యూహం..?

తెలంగాణలో టీఆర్ఎస్ నెంబర్ వన్.. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి సెకండ్ ఎవరు.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణలో బలంగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో మరింత జోరు పెంచింది.. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు టీఆర్‌ఎస్‌పై కోపం వస్తుందా.. అప్పుడు ప్రత్యామ్నాయం మేమే కదా.. మాకే కదా ఓటేసేది అన్న ధోరణి నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌లో ఉండేది.. కానీ.. కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయ తెరపై బీజేపీ దూసుకొచ్చింది.

ఇలా బీజేపీ దూసుకురావడానికి కూడా టీఆర్ఎస్సే కారణం.. బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్‌ను పూర్తిగా మట్టికరిపించాలని ఆ పార్టీ నుంచి నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుని మరీ బలహీన పరిచేశారు. దీంతో జనం బీజేపీని నమ్మడం ప్రారంభించారు. అందుకే ఎన్నడూ లేనిది గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది. ఆ తర్వాత దుబ్బాక గెలుచుకుంది. జీహెచ్‌ఎంసీలోనూ టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చేసింది. అయితే ఇంతగా బీజేపీ పుంజుకుంటున్నా టీఆర్ఎస్‌ తమ ప్రత్యర్థిగా బీజేపీ ఉంటేనే బాగని కోరుకుంటోంది.

అబ్బే అసలు కాంగ్రెస్ పోటీలోనే లేదని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలు బీజేపీని పెద్దగా చేసి చూపించేందుకే అన్నది అర్థమవుతోంది. ఇక్కడే కేసీఆర్ వ్యూహం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్‌ కానీ... బీజేపీ కానీ పూర్తిగా పుంజుకోకూడదు. రెండు ప్రత్యర్థి పార్టీలూ సమంగా ఉండాలి.. అప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు సమంగా చీలిపోతుంది. అది టీఆర్ఎస్‌కు లాభం చేస్తుంది. అలా కాకుండా జనం పూర్తిగా కాంగ్రెస్‌నో.. బీజేపీనో తమ పూర్తిగా నమ్మడం ప్రారంభిస్తే అది టీఆర్‌ఎస్‌ కు పెద్ద దెబ్బ అవుతుంది.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌ జోష్‌ మీద ఉంది. ఇదే జోరు కొనసాగితే బీజేపీ డల్ అవుతుంది. అప్పుడు టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అవుతుంది. అలా కాకూడదంటే బీజేపీని పైకి లేపాలి. రెండు పార్టీలనూ సమం చేయాలి.. ఓట్ల విభజన జరగాలి.. అల్టిమేట్‌గా టీఆర్‌ఎస్‌కు మేలు జరగాలి.. ఇదీ ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహం. అందుకే టీఆర్ఎస్ నేతలు.. అసలు కాంగ్రెస్ రాష్ట్రంలో లేదని ప్రకటనలు చేస్తున్నారు. మరి ఈ వ్యూహం వర్కవుట్ అవుతుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: