ఓవ‌ర్ టు ఒలంపిక్స్ : అమ్మాయిలే గ్రేట్

RATNA KISHORE

అమ్మాయిలు ప‌రుగుల్లో గ్రేట్
ప‌త‌కాల్లో గ్రేట్
ఇంటా బ‌య‌టా ఆకాశంలో
నేల‌పై అంతటా అమ్మాయిలే గ్రేట్
కరోనాతో ఆరోగ్యం క్షీణించినా
తిండికి లేని రోజుల్లో సాధ‌న చేసినా
నాన్న‌కు ధైర్యం చెప్పి టోక్యోకు వెళ్లినా
ప‌త‌కాల సాధ‌న‌లో
పంతాన్ని నెగ్గించుకోవ‌డంలో
అమ్మాయిలే గ్రేట్..

 ఈశాన్య రాష్ట్రం గ‌ర్వించే తేజం..


టోక్యో ఒలంపిక్స్..ఆమెపై ఎప్పుడూ అంచ‌నాలే లేవు..మీరాచాను తొలి  రోజు ర‌జ‌త ప‌త‌కంతో దేశ ప‌తాక‌ను రెప‌రెప‌లాడించింది. ఇప్పుడు ఆమె అడిష‌న్ ఎస్పీగా స్పోర్ట్స్ కోటాలోనే ఉద్యోగం పొంది దేశానికీ, పుట్టిన  ఊరికీ ఎం తో పేరు తెచ్చింది. ఒక్క‌టే ఒక్క‌టి అ న్నారు ఆమె..నేను ప్రాక్టీసుకు పోతుంటే నాకు లిఫ్ట్ ఇచ్చి సాయం చేసిన ఇసుక లారీ డ్రైవ‌ర్ల‌కు నేనేమ‌యినా చేయాలి అని.. ఎం తో ఆనందించాలి ఇలాంటివి చ‌దివి. ఇలాంటివి చ‌దివితే మీ రా మ‌ళ్లీ గ్రేట్ అని అర‌వాలి మీరు..ఆ విధంగా ఈశాన్య రాష్ట్రం గ‌ర్వించే తేజం..

వ‌రుస విజ‌యాలు
ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా


తెలుగమ్మాయి వెలుగమ్మాయి అని పాడండి సింధూని చూసి..రెండు ప‌త‌కాలు..దేశం గ‌ర్వించే స్థాయిలో ప్ర‌పంచం జేజేలు ప‌లికే  స్థాయిలో.. పార్క్ , గోపీచంద్ లాంటి గురువుల శిక్ష‌ణ‌లో.. స‌ర్... మీ  స‌పోర్ట్ మ‌రువలేం అని అన్నారు పార్క్ ను చూసి కిరణ్ రిజుజు..అనే కేంద్ర మంత్రి.. ఇక గెలిచిన ఉత్సాహంలో ఈ గెలుపు నాది కాదు క‌రోనా తో బాధ‌ప‌డిన కుటుంబాల‌ది..ఇంకా నా గురువు పార్క్ ది అని..ఇలా విన‌య‌పూర్వ‌కంగా చెప్పిన సింధూ గ్రేట్ ... ఓడినా గెలిచినా ఆక‌లి క‌న్నీరు దాటి వ‌చ్చిన వారంతా ఆ మహిళా హాకీ జ‌ట్టులో ఉన్నారు..వారంతా గ్రేట్.. క‌రోనాను జ‌యించి త‌న నాన్న క‌ల‌ను నిల‌బెట్టిన ఈ బిడ్డ లవ్లీనా ఇంకా గ్రేట్..అమ్మ‌నాన్న‌ల‌కు వంద‌నాలు చె ల్లించాలి..క‌ల‌లకు ఊహ‌ల‌కు మ‌ద్దతు ఇచ్చిన వారికి వంద‌నాలు చెల్లించాలి. జై హింద్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: