నైబర్ హుడ్ రూల్ : బైడెన్ మాత్రం న్యాయం చేస్తాడా?
నైబర్ హుడ్ రూల్ : బైడెన్ మాత్రం న్యాయం చేస్తాడా?
స్థానికత, స్థానిక యువత అన్నవి ఎన్నటి నుంచో అమెరికాను శాసిస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా భారతీయ సంతతి అక్కడికి చేరుకోవడంతో ఉద్యోగ అవకాశాలలో తమకు అన్యాయం అవుతుందని ఎన్నటి నుంచో పోరాడుతున్నారు..అక్కడి యువత. ఇ ప్పుడది కీలక దశకు చేరుకుంది. కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఏం చేస్తారో అన్నది ఆసక్తిదాయక పరిణామం. మోడీ దీనిపై ఎలా స్పందిస్తారో అన్నది ఇంకా ఆసక్తిదాయకం.
భారతీయ విద్యార్థులకు నాణ్యమయిన, ఉద్యోగ భరోసాతో కూడిన విద్య ఉంటే మేలు. అది ఇండియన్ సొసైటీ నుంచి ఆశించలేక, దక్కక కొందరు తమ కలల సాకారానికి ప్రాధాన్యం ఇస్తూ అమెరికా గూటికి చేరుతున్నారు. ఊహలు విస్తృతం చేసుకుంటూ చదు వు, పరిశోధన, అభివృద్ధిలో ఆ దేశపు యువతతో పోటీపడుతూ.. తమని తాము నిరూపించుకుంటున్నారు. ఇటీవల కాలంలో అ మెరికన్లకూ స్థానికత అన్నది అవసరం వచ్చి పడింది. ముందు ఉద్యోగావకాశాలలో తమకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తరువాత దే శేతర వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది. ఈ సమస్య వచ్చిన ప్రతిసారీ భారతీయ విద్యార్థుల్లో సంబంధిత తల్లిదండ్రుల్లో క లవరం రేగుతూనే ఉంది. ఇప్పుడొక బిల్లు దానిపేరు ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ .. ఇదే మనకో గుదిబండగా మా రనుంది.
రెండు దేశాల ప్రేమ సత్సంబంధాల ఒడంబడిక అన్నవి రెండు దేశాల సఖ్యతనూ, అలానే అభివృద్ధినీ ప్రభావితం చేస్తాయన్నది కా దనలేని వాస్తవం. జో బైడెన్ దేశాధ్యక్షుడు అయ్యాక అంతా ఊహించే విధంగానే జరుగుతోంది. భారతీయ విద్యార్థులకు వారి ఉ ద్యోగ అవకాశాలకూ గండి కొట్టే ప్రయత్నం ఒకటి తప్పక జరిగి తీరుతుంది. కొత్త బిల్లు ఒకటి ఆ పని చేస్తుంది. ఈ వ్యవహారంలో వే లూ కాలూ పెట్టేందుకు మోడీకి ఛాన్స్ ఉండదనుకోండి. అయినా సరే బై లేటరల్ రిలేషన్స్ ను ఆయన ప్రభావితం చేయగలరు.
ఎన్నికలప్పుడే భారత్ తో సత్సంబంధాలు అని, ఆ తరువాత మీతో మాకేం పని అని ఓ పెద్దన్న అంటుండె..ఆ పెద్దన్న ఎవరో కా దు అమెరికా. పైన పేర్కొన్న విధంగా కొత్తగా తీసుకువస్తున్న బిల్లు కారణంగా భారతీయ విద్యార్థులు చిక్కుల్లో పడే అవకాశాలే మెండు. దీంతో భారతీయ విద్యార్థుల్లో కలవరం రేగుతోంది. కొత్త బిల్లు కారణంగా విద్యావకాశాల కోసం అమెరికాకు వచ్చే భారతీ యులు తమ చదువులు ముగియగానే స్వదేశానికి పోవాలని ఆదేశిస్తుంది. ఇదే గనుక అమలుకు నోచుకుంటే భారతీయులంతా ఉద్యోగావకాశాలపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే! మరోవైపు ఈ బిల్లు ఇప్పటికిప్పుడు ఆమోదం పొందకపోయినా రేపటి వేళ ఇలాంటి చర్యలకు అమెరికన్ గవర్నమెంట్ వెనుకాడేందుకు ఏ మాత్రం తాత్సారం చేయదు. ఆపరేషనల్ ప్రాక్టీస్ ట్రయినింగ్ అన్నది ఒకవేళ రద్దయితే, కొత్త బిల్లు ప్రకారం వీరంతా చదువు పూర్తయ్యాక మునుపటిలా మూడేళ్ల పాటూ అక్కడే ఉండి, ఉద్యోగావకాశాలు పొందేందుకు వీలుండదు అన్నది ప్రాథమిక సమాచారం.